క్రీడాభూమి

132 ఏళ్లకు తొలి టైటిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 3: లీసెస్టర్ సిటీ జట్టు తొలి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. 132 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న లీసెస్టర్ సిటీకి ఇంత వరకూ ఈ టైటిల్ దక్కలేదు. ఒకసారి ఫైనల్ చేరినప్పటికీ, రన్నర్ ట్రోఫీతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇలావుంటే, టోటెన్‌హామ్ హాట్స్‌పర్, చెల్సియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా కావడంతో ఈసారి ప్రీమియర్ లీగ్ టైటిల్ లీసెస్టర్ సిటీకి దక్కడం విశేషం. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో చెల్సియాను ఓడిస్తే టోటెన్‌హామ్‌కు టైటిల్ లభించేది. ఆ జట్టు ఆటగాళ్లు హారీ కేన్ 35వ నిమిషంలో, సన్ హుయెంగ్ మిన్ 44వ నిమిషంలో గోల్స్ చేసి, చెల్సియాపై 2-0 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టారు. తక్కువ వ్యవధిలోనే టోటెన్‌హామ్ రెండు గోల్స్ సాధించడంతో కంగుతిన్న చెల్సియా ద్వితీయార్థంలో ఎదురుదాడికి దిగింది. 58వ నిమిషంలో గారీ కాహిల్ గోల్ చేశాడు. ఆతర్వాత టోటెన్‌హామ్ పూర్తి రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, విజయంపై తద్వారా టైటిల్‌పై ఆశలు పెంచుకుంది. కానీ, చివరి క్షణాల్లో ఎడెన్ హజార్డ్ ఎవరూ ఊహించని విధంగా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. బంతిని హెడర్ ద్వారా అతను గోల్ పోస్టులోకి పంపిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హజార్డ్ ఈ కీలక గోల్‌తో పరోక్షంగా లిసెస్టర్ సిటీ టైటిల్ సాధించేందుకు సహకరించాడు. ఒక రకంగా అతని వల్లే లిసెస్టర్ తొలిసారి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ చాంపియన్‌గా నిలిచి, చరిత్ర సృష్టించగలిగింది. అంతకు ముందు మాంచెస్టర్ యునైటెడ్‌తో చివరి మ్యాచ్‌ని ఆడిన లీసెస్టర్ సిటీ 1-1గా డ్రా చేసుకొని, టైటిల్ రేసులో నిలిచింది.