క్రీడాభూమి

కోహ్లీకి ఖేల్ రత్న?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డుకు స్టార్ బ్యాట్స్‌మన్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రతిపాదించింది. అదే విధంగా అర్జున అవార్డుకు ఆజింక్య రహానే పేరును సిఫార్సు చేసింది. నాలుగు సంవత్సరాల కాలంలో ఖేల్ రత్న అవార్డుకు బిసిసిఐ పేరు పంపించడం ఇదే మొదటిసారి. క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఇద్దరు ఆటగాళ్లు, సచిన్ తెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ ఖేల్ రత్న అవార్డును స్వీకరించారు. కోహ్లీ పేరును అవార్డు కమిటీ ఆమోదిస్తే, అతను మూడో క్రికెటర్ అవుతాడు. ఈ అవార్డు కింద 7.5 లక్షల రూపాయల నగదు బహుమతితోపాటు ప్రశంసా పత్రం, పతకాలను బహూకరిస్తారు. అర్జున అవార్డు పొందిన వారికి ఐదు లక్షల రూపాయల బహుమతి ఉంటుంది. ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టి-20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో భారత్‌ను విజయపథంలో నడిపించాడు. టి-20 ఫార్మెట్‌లో ప్రపంచ మేటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కాగా, రహానే కూడాభారత జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గాలీలో గత ఏడాది ఆగస్టులో టెస్టు ఆడుతూ, ఒక ఇన్నింగ్స్‌లోనే ఎనిమిది క్యాచ్‌లు పట్టాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఎక్కువ క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఇలావుంటే, రహానేకు అర్జున అవార్డు ఖాయంగా కనిపిస్తున్నది. ఖేల్ రత్న అవార్డు కోసం స్క్వాష్ చాంపియన్‌షిప్ దీపికా పల్లీకల్, గోల్ఫర్ అనిర్బన్ లాహిరి, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన షూటర్ జితూ రాయ్, రన్నర్
టింటూ లుకా నుంచి కోహ్లీ గట్టిపోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రాజీవ్ ఖేల్ రత్న అవార్డును 1991-92 సీజన్‌లో ప్రవేశపెట్టారు. మొట్టమథటి ఈ అవార్డును చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ స్వీకరించాడు. 2008, 2014 సంవత్సరాల్లో ఈ అవార్డును ఎవరికీ ఇవ్వలేదు. క్రికెటర్ల విషయానికి వస్తే, సచిన్ తెండూల్కర్ 1997-98 సీజన్‌కు, మహేంద్ర సింగ్ ధోనీ 2007 సంవత్సరానికి ఈ అవార్డును పొందారు. గీత్ సేథీ, హోమీ మోతీవాలా, పికె గార్గ్, కరణం మల్లీశ్వరి, కుంజరాణి దేవి, లియాండర్ పేస్, జ్యోతిర్మయ శిక్దర్, ధన్‌రాజ్ పిళ్లై, పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా, కెఎం బీనామోల్, అంజలి భగవత్, అంజూ బాబీ జార్జి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, పంకజ్ అద్వానీ, మానవ్‌జిత్ సింగ్ సంధు, మేరీ కోమ్, విజేందర్ సింగ్, సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, రొజన్ సింగ్, సైనా నెహ్వాల్, గగన్ నారంగ్, విజయ్ కుమార్ ఈ అవార్డును స్వీకరించారు. గత ఏడాది టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ అవార్డు లభించింది.