క్రీడాభూమి

‘వనే్డ’లో టీమిండియా పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 4: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా జట్టు వనే్డ ర్యాంకింగ్స్‌లో ఒకటి నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. కాగా, వనే్డ ఫార్మెట్ బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీకి టి-20 ఫార్మెట్‌లో అగ్రస్థానం దక్కింది. వనే్డ ర్యాంకింగ్స్‌లో ఎబి డివిలియర్స్ నంబర్ వన్‌గా నిలవగా, కోహ్లీది రెండో స్థానం, హషీం ఆమ్లా మూడో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా టి-20 ఫార్మెట్ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్, మార్టిన్ గుప్టిల్ మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. వనే్డ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. నాలుగో స్థానం భారత్‌కు దక్కింది. అయితే, టి-20 ఫార్మెట్‌లో టీమిండియా రెండో స్థానంలో ఉంది.
టెస్టు ఫార్మెట్‌లో ‘టాప్-10’ జట్లు: 1. ఆస్ట్రేలియా, 2. భారత్, 3. పాకిస్తాన్, 4. ఇంగ్లాండ్, 5. న్యూజిలాండ్, 6. దక్షిణాఫ్రికా, 7. శ్రీలంక, 8. వెస్టిండీస్, 9. బంగ్లాదేశ్.
పదో స్థానంలో జింబాబ్వే ఉండాలి. అయితే, ర్యాంకింగ్స్ ప్రకటించడానికి ఆ సీజన్‌లో కనీసం ఎనిమిది టెస్టులు ఆడాలి. అన్ని టెస్టులు ఆడని కారణంగా, పదో స్థానాన్ని జింబాబ్వేకు అధికారికంగా ప్రకటించలేదు.
వనే్డ ఫార్మెట్‌లో ‘టాప్-10’ జట్లు: 1. ఆస్ట్రేలియా, 2. న్యూజిలాండ్, 3. దక్షిణాఫ్రికా, 4. భారత్, 5. శ్రీలంక, 6. ఇంగ్లాండ్, 7. బంగ్లాదేశ్, 8. వెస్టిండీస్, 9. పాకిస్తాన్, 10. అఫ్గానిస్తాన్.
టి-20 ఫార్మెట్‌లో ‘టాప్-10’ జట్లు: 1. న్యూజిలాండ్, 2. భారత్, 3. వెస్టిండీస్, 4. దక్షిణాఫ్రికా, 5. ఇంగ్లాండ్, 6. ఆస్ట్రేలియా, 7. పాకిస్తాన్, 8. శ్రీలంక, 9. అఫ్గానిస్తాన్, 10. బంగ్లాదేశ్.
వనే్డల్లో ‘టాప్-10’ బ్యాట్స్‌మెన్: 1. ఎబి డివిలియర్స్ (900 పాయింట్లు/ దక్షిణాఫ్రికా), 2. విరాట్ కోహ్లీ (825/ భారత్), 3. హషీం ఆమ్లా (766/ దక్షిణాఫ్రికా), 4. క్వింటన్ డికాక్ (763/ దక్షిణాఫ్రికా), 5. రోహిత్ శర్మ (761/ భారత్), 6. తిలకరత్నే దిల్షాన్ (760/ శ్రీలంక), 7. కేన్ విలియమ్‌సన్ (752/ న్యూజిలాండ్), 8. మార్టిన్ గుప్టిల్ (751/ న్యూజిలాండ్), 9. శిఖర్ ధావన్ (748/ భారత్), 10. జో రూట్ (739 పాయింట్లు/ ఇంగ్లాండ్).
వనే్డల్లో ‘టాప్-10’ బౌలర్లు: 1. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), 2. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), 3. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), 4. మాట్ హెన్రీ (న్యూజిలాండ్), 5. ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), 6. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), 7. మోర్న్ మోర్కెల్ (దక్షిణాఫ్రికా), 8. సరుూద్ అజ్మల్ (పాకిస్తాన్), 9. మహమ్మద్ ఇర్ఫాన్ (పాకిస్తాన్), 10. రవిచంద్రన్ అశ్విన్ (్భరత్).
టి-20లో ‘టాప్-10’ బ్యాట్స్‌మెన్: 1. విరాట్ కోహ్లీ (్భరత్), 2. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), 3. మార్టిన్ (న్యూజిలాండ్), 4. జో రూట్ (ఇంగ్లాండ్), 5. ఫఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా), 6. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్), 7. అలెక్స్ హాలెస్ (ఇంగ్లాండ్), 8. క్రిస్ గేల్ (వెస్టిండీస్), 9. హామిల్టన్ మసకజా (జింబాబ్వే), 10. మహమ్మద్ షెజాద్ (అఫ్గానిస్తాన్).
టి-20లో ‘టాప్-10’ బౌలర్లు: 1. శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్), 2. ఇమ్రాన్ తాహీర్ (దక్షిణాఫ్రికా), 3. రవిచంద్రన్ అశ్విన్ (్భరత్), 4, షహీద్ అఫ్రిదీ (పాకిస్తాన్), 5. కేల్ అబోట్ (దక్షిణాఫ్రికా), 6. మిల్నే (న్యూజిలాండ్), 7. జస్‌ప్రీత్ బుమ్రా (్భరత్), 8. జేమ్స్ ఫాల్క్‌నెర్ (ఆస్ట్రేలియా), 9. మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్), 10. రవీంద్ర జడేజా (్భరత్).