క్రీడాభూమి

జింబాబ్వే టూర్‌కు బిసిసిఐ గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 4: జింబాబ్వేలో టీమిండియా పర్యటించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) గ్రీన్ సిగ్నలఇ ఇచ్చింది. జూన్ మాసంలో భారత జట్టు తమ దేశంలో పర్యటిస్తుందని జింబాబ్వే క్రికెట్ (జెడ్‌సి) ప్రకటించిన విషయం తెలిసిందే. బిసిసిఐ తమ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేయాల్సి ఉందని స్పష్టం చేశాడు. కాగా, జెడ్‌సి ప్రతిపాదనను అంగీకరించిన బిసిసిఐ ఈ టూర్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. జూన్ 11, 13, 15 తేదీల్లో వరుసగా మొదటి, రెండో, మూడో వనే్డ ఇంటర్నేషనల్స్ జరుగుతాయని పేర్కొంది. అదే విధంగా 18, 20, 22 తేదీల్లో మూడు వనే్డ ఇంటర్నేషనల్స్ ఉంటాయని తెలిపింది. ఈ మ్యాచ్‌లకు హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ మైదానం ఆతిథ్యమిస్తుందని వివరించింది. కాగా, గత ఏడాది ఆజింక్య రహానే నాయకత్వంలో జింబాబ్వేకు వెళ్లిన భారత్ మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకుంది. రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను 1-1గా డ్రా చేసుకుంది.