క్రీడాభూమి

ధోనీకి జహీర్ సవాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 4: ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగే గ్రూప్ మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌కు మహేంద్ర సింగ్ ధోనీకి ఢిల్లీ డేర్‌డెవిల్స్ సారథి జహీర్ ఖాన్ సవాళ్లు విసరనున్నాడు. గత ఏడాది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అట్టడుగు స్థానంలో నిలవగా, అంతకంటే కేవలం ఒక స్థానం మెరుగైన స్థితిలో ఉన్న డేర్‌డెవిల్స్ ఈసీజన్‌లో ఎవరూ ఊహించని రీతిలో ఆడుతున్నది. ఇప్పటి వరకూ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలను నమోదు చేసింది. టేబుల్ టాపర్ గుజరాత్ లయన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసిన ఉత్సాహంలో దూకుడు మీద ఉన్న డేర్‌డెవిల్స్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నది. జహీర్ ఖాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో, అదే విధంగా చివరిలో గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను ఫామ్‌లో ఉండడం మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తున్నది. అమిత్ మిశ్రా కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సమర్థంగా కట్టడి చేస్తున్నాడు. సీనియర్లు బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటే, యువ ఆటగాళ్లు వారిని అనుసరిస్తున్నారు. గుజరాత్ లయన్స్‌పై వృషభ్ పంత్ విజృంభించడమే ఇందుకు ఉదాహరణ.
అన్ని విభాగాల్లోనూ సమష్టి కృషితో రాణిస్తున్న డేర్‌డెవిల్స్‌తో పోలిస్తే రైజింగ్ పుణె కొంత మెరుగైన స్థితిలోనే ఉండేది. కానీ, కెవిన్ పీటర్సన్, ఫఫ్ డు ప్లెసిస్, షాన్ మార్ష్, స్టీవెన్ స్మిత్ గాయాల కారణంగా టోర్నీకి దూరం కావడం ఆ జట్టును సమస్యల్లోకి నెట్టింది. జట్టులోకి కొత్తగా వచ్చి చేరిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజా ఎంత వరకూ రాణిస్తాడో చూడాలి. వరుస పరాజయాలు, ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్న నేపథ్యంలో ధోనీ ఎంతటి నాయకత్వ ప్రతిభను కనబరచినా ఫలితం లేకుండా పోతున్నది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి, జట్టును మళ్లీ విజయాల బాటను పట్టించాలన్న ధోనీ ప్రయత్నం ఎంత వరకూ నెరవేరుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.