క్రీడాభూమి

పాక్ కోచ్‌గా స్టువర్ట్ లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 4: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు స్టువర్ట్ లాను ఎంపిక చేసినట్టు సమాచారం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అతని పేరును ఏకగ్రీవంగా ఆమోదించారని విశ్వసనీయ వర్గాలు పిటిఐకి తెలిపాడు. ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్ దారుణంగా విఫలమైన కారణంగా కోచ్ వకార్ యూనిస్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా కోచ్‌ని నియమించడానికి వీలుగా దరఖాస్తులను ఆహ్వానించిన పిసిబి స్టువర్ట్ లా పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 54 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన స్టువర్ట్ లా క్రికెటర్‌గా అంతగా రాణించలేకపోయినప్పటికీ, కోచ్‌గా మంచి పేరు సంపాదించాడు. ప్రస్తుతం అతను శ్రీలంక టూర్‌కు వెళ్లనున్న ఆస్ట్రేలియా జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. ఆసీస్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన షిఫీల్డ్ షీల్డ్ చాంపియన్‌షిప్‌లో అతను కోచ్‌గా సేవలు అందించిన క్వీన్స్‌లాండ్ అద్భుత విజయాలను నమోదు చేసింది. ఇంగ్లీష్ కౌంటీలు ఎసెక్స్, లాంకషైర్ జట్లకు కూడా స్టువర్ట్ లా కోచ్‌గా వ్యవహరించాడు. అంతేగాక, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు సైతం అతను కోచ్‌గా వ్యవహరించాడు. కాగా, విదేశీ కోచ్‌ని నియమించాలని పిసిబి ముందుగానే నిర్ణయించుకోవడంతో, పాక్ మాజీ క్రికెటర్లలో ప్రముఖులు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. గడువులోగా తమకు అందిద దరఖాస్తులను పరిశీలించిన తర్వాత స్టువర్ట్ లా పేరును పిసిబి ఏకగ్రీవంగా ఆమోదించిందని బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే, పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. బోర్డు పాలక మండలి సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడిన అతను కొన్ని అంశాలను ప్రస్తావించాడు. కోచ్ పదవికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించామని అన్నాడు. కానీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటూ సమాచారం ఇవ్వకుండా దాటవేశాడు. స్టువర్ట్ లాతో కాంట్రాక్టు కుదుర్చుకున్న తర్వాత ఈ విషయాన్ని అతను అధికారికంగా ప్రకటిస్తాడని తెలుస్తోంది.