క్రీడాభూమి

టెస్టు సిరీస్‌పైనే టీమిండియా దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు ఏడు దశాబ్దాల నుంచి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను కైవశం చేసుకోవడానికి విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా దృష్టి సారించింది. విదేశీ మైదానాల్లో ఇటీవల దక్షిణాఫ్రికా, ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లను కోల్పోయిన భారత్ ఆసిస్‌లో ఘన విజయం సాధించడం ద్వారా ఈ గడ్డపై ఇంతవరకూ టీమిండియా సాధించని రికార్డు నెలకొల్పాలని ఉవ్విళ్లూరుతోంది. ఆస్ట్రేలియా మైదానాల్లో భారత్ ఇంతవరకు ఆడిన 44 టెస్టుల్లో కేవలం నాలుగు మ్యాచ్‌లలోనే గెలుపొందగా, రెండు సిరీస్‌లు డ్రా అయ్యాయి. 1980-81లో సునీల్ గవాస్కర్, 2003-04లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత ఆటతీరును కనబరిచింది. మళ్లీ చాలాకాలం తర్వాత ఈ గడ్డపై ఆడుతున్న భారత్ తప్పనిసరిగా టెస్టు సిరీస్‌ను గెలిచేందుకు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.

చిత్రం..ట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ, టిమ్ పైన్