క్రీడాభూమి

మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ క్విటోవా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 4: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో పెట్రా క్విటోవా ముందంజ వేసింది. రెండో రౌండ్‌లో ఆమె ఎలెనా వెస్నినాను 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసి మూడో రౌండ్కు దూసుకెళ్లింది. సిమోనా హాలెప్ 6-1, 6-1 స్కోరుతో కరిన్ నాప్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేయగా, తిమియా బసిన్‌స్కీ 6-4, 5-7, 6-4 స్కోరుతో ఎకతరిన మకరోవాపై గెలుపొందింది. డొమినికా సిబుల్కొవా 0-6, 6-3, 6-4 తేడాతో కరోలినా గార్సియాను, లారా సిగెమండ్ 6-2, 3-6, 6-3 స్కోరుతో మిర్జానా రూసీక్ బరోనీని, సొరానా సిర్‌స్టియా 5-7, 6-1, 6-3 తేడాతో డన్కా కొవొనిక్‌ను ఓడించి మూడో రౌండ్‌లో స్థానం సంపాదించారు. డారియా గవ్రిలొవా 6-2, 7-6 ఆధిక్యంతో ఎలినా స్విటోలినాపై గెలిచింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో రాఫెల్ నాదల్, ఆండ్రీ ముర్రే తమతమ ప్రత్యర్థులను ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. నాదల్ 6-3, 6-3 స్కోరుతో ఆండ్రె కుజ్నెత్సోవ్‌ను చిత్తుగా ఓడించాడు. ముర్రే 7-6, 3-6, 6-1 ఆధిక్యంతో 37 ఏళ్ల రాడెన్ స్టెపానెక్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో, జవాన్ డెల్ పొట్రో 7-6, 6-3 స్కోరుతో జాక్ సాక్‌పై గెలిచాడు. ఒకప్పుడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానాన్ని ఆక్రమించిన పొట్రో ప్రస్తుతం 274వ స్థానంలో ఉన్నాడు. ఇటీవల కాలంలో అంతగా రాణించలేకపోతున్న అతను ఈ టోర్నీలో ముందంజ వేయడం విశేషం. గేల్ మోన్ఫిల్ 6-4, 6-1 ఆధిక్యంతో కెవిన్ ఆండర్సన్‌పై గెలుపొందగా, రాబర్టో బటిస్టా అగట్ 6-3, 7-5 తేడాతో క్వాలియఫర్ సాంటియాగో గిరాల్డోను ఓడించాడు. 10వ సీడ్ రిచర్డ్ గాస్క్వెట్ సుమారు రెండు గంటలు పోరాడి, 6-4, 3-6, 6-1 తేడాతో ఫెర్నాండో వెర్డాస్కోపై విజయం సాధించాడు.

గంభీర్‌కు జరిమానా
బెంగళూరు, మే 3: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్‌కు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించినట్టు ఐపిఎల్ నిర్వాహణ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగ్రహంతో ఒక కుర్చీని కాలితో కొట్టినందుకు ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. ఐపిఎల్ నిబంధనల ప్రకారం, టోర్నీకి సంబంధించిన దుస్తులు లేదా వస్తువులను ధ్వంసం చేయడం నేరని, గంభీర్ తన పొరపాటును అంగీకరించడంతో అతనిని జరిమానాతో విడిచిపెట్టామని తెలిపింది. అదే విధంగా నైట్ రైడర్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో తలపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 24 లక్షల రూపాయల జరిమానా విధించామని పేర్కొంది. కోహ్లీ కి ఇది రెండోసారి జరిమానా.