క్రీడాభూమి

వాలీబాల్ లీగ్ వేలంలో స్టార్ అట్రాక్షన్ లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత వాలీబాల్ సమాఖ్య (వీఎప్‌ఐ) ఆధ్వర్యంలో జరగబోయే ప్రో వాలీబాల్ లీగ్ టోర్నమెంట్‌కు జరిగే వేలంలో అమెరికా సూపర్ ప్లేయర్ డేవిడ్ లీ స్టార్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. అమెరికా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతను 2008లో ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2016లో కాంస్య పతకాన్ని గెల్చుకున్న అమెరికా జట్టులోనూ అతను సభ్యుడిగా ఉన్నాడు. ఈనెల 14న ఇక్కడ జరిగే వేలంలో అతనికి భారీ ధర పలుకుతుందని అంచనా. విదేశీ ఆటగాళ్లతోపాటు 170 మంది భారత క్రీడాకారులు కూడా వేలానికి రానున్నారు. వీరిని ఐకాన్ ప్లేయర్స్, ఇండియన్ సీనియర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, డొమెస్టిక్ ప్లేయర్స్, అండర్-21 ప్లేయర్స్ అనే నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. వేలం జాబితాలో లీతోపాటు రూడీ వెథెర్ఫ్ (కెనడా), పాల్ లాట్మన్, కార్సన్ క్లార్క్ (అమెరికా), నొవికా బెలికాబెలికా (సెర్బియా), టొమిస్లావ్ కొస్కొవిచ్ (టర్కీ) వంటి మేటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.