క్రీడాభూమి

మాడ్రిడ్ ఓపెన్ సెమీస్‌కు హాలెప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 5: స్పెయిన్‌లో జరుగుతున్న మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆరో సీడ్ క్రీడాకారిణి సిమోనా హాలెప్‌తో పాటు అన్‌సీడెడ్ క్రీడాకారిణి డొమినికా సిబుల్కోవా సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో వీరు తమతమ ప్రత్యర్థులపై చెమటోడ్చి విజయం సాధించారు. అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఇరినా కమెలియా బెగుతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 6-3 తేడాతో కైవసం చేసుకున్న హాలెప్‌కు ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. ఫలితంగా రెండో సెట్‌ను 0-6 తేడాతో కోల్పోయిన హాలెప్ నిర్ణాయక మూడో సెట్‌లో పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి 6-1 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో తొలి సెట్‌ను 4-6 తేడాతో కోల్పోయిన డొమినికా సిబుల్కోవా ఆ తర్వాత 6-3, 6-3 తేడాతో వరుసగా రెండు సెట్లను గెలుచుకుని అన్‌సీడెడ్ క్రీడాకారిణి సొరానా క్రిస్టీని మట్టికరిపించగా, మరో అన్‌సీడెడ్ క్రీడాకారిణి లూయిసీ చిరికో 7-6, 6-2 వరుస సెట్ల తేడాతో దరియా గవ్రిలోవాపై ఘనవిజయం సాధించి సెమీ ఫైనల్స్‌లో ప్రవేశించింది.
మూడో రౌండ్ అధిగమించిన జొకోవిచ్, ముర్రే
ఇదిలావుంటే, పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో పాటు రెండో సీడ్ ఆటగాడు ఆండీ ముర్రే (బ్రిటన్), ఆరో సీడ్ ఆటగాడు కై నిషికోరీ (జపాన్), ఎనిమిదో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్‌ను అధిగమించారు. జొకోవిచ్ 6-2, 6-1 తేడాతో 15వ సీడ్ రాబెర్టో బటిస్టా అగట్‌ను, ముర్రే 6-4, 6-2 తేడాతో 16వ సీడ్ గిలెస్ సైమన్‌ను, నిషికోరీ 6-4, 7-5 తేడాతో 10వ సీడ్ రిచర్డ్ గాస్కెట్‌ను, బెర్డిచ్ 7-6, 7-5 తేడాతో తొమ్మిదో సీడ్ ఆటగాడు డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)ను మట్టికరిపించారు. అలాగే మూడో రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్ ఆటగాడు నిక్ కిర్గియోస్ 7-6, 4-6, 6-3 తేడాతో పాబ్లో క్యువాస్‌పై విజయం సాధించి తదుపరి రౌండ్‌లో ప్రవేశించాడు.