క్రీడాభూమి

క్వార్టర్స్‌పై ఫ్రాన్స్ చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 9: అండర్ డాగ్‌గా బరిలోకి దిగినప్పటికీ, ఎవరూ ఊహించని విధంగా ముందంజ వేయడమేగాక, ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాపై 5-3 తేడాతో విజయభేరి మోగించిన ఫ్రాన్స్ జట్టు ఇక్కడ జరుగుతున్న వరల్డ్ కప్ హాకీలో క్వార్టర్ ఫైనల్స్‌పై కనే్నసింది. సోమవారం చైనాతో జరిగే కీలక మ్యాచ్ కోసం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్టు జట్టు మేనేజ్‌మెంట్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. వరల్డ్ కప్‌లో ఎంతగా రాణిస్తే, 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో గొప్పగా ఆడే అవకాశాలను పంచుకునే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించింది. అన్ని విభాగాల్లోనూ ఆటగాళ్లు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, వ్యూహ రచనేగాక, దానిని పకడ్బందిగా అమలు చేయడంలోనూ సఫలమవుతున్నారని జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. అర్జెంటీనాను ఓడించడంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని అంటూనే, చైనాతో మ్యాచ్‌ని తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేసింది. ఇలావుంటే, ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ చేరిన భారత జట్టు సెమీ ఫైనల్‌లో స్థానం కోసం ఈనెల 13న మ్యాచ్‌ని ఆడనుంది. కాగా, గ్రూప్ దశలో సోమవారం ఫ్రాన్స్, చైనా మ్యాచ్‌తోపాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పోరు కూడా ఉంటుంది.