క్రీడాభూమి

కొత్త ఉత్సాహంతో పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: అయిదు రోజుల విశ్రాంతి తర్వాత నూతనోత్సాహంతో తొణికిసలాడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం సొంతగడ్డపై బలమైన గుజరాత్ లయన్స్‌ను ఢీకొనడానికి సిద్ధమవుతోందని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురువారం చెప్పాడు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు తాము రెండు మ్యాచ్‌లు గెలిచి, మరో రెండు ఓడిపోయామని వార్నర్ అంటూ, అయితే, ప్రారంభంలో వరస ఓటముల తర్వాత తాము ఇప్పుడు చక్కగా రాణిస్తున్నామని చెప్పాడు. ఈ పరిస్థితిలో రాణించడం అనేది ఆటగాళ్లకు ఓ సవాలేనని, అయితే జట్టులోని అందరు కూడా సానుకూల దృక్పథంతో ఉన్నారని అన్నాడు. గత రెండు రోజులుగా విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు నూతనోత్సాహంతో పోరుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. గుజరాత్ లయన్స్ బలమైన జట్టని వార్నర్ అంటూ, జట్టులోని బీభత్స బ్యాట్స్‌మెన్‌ను అదుపుచేయాలంటూ తాము ప్రారంభంలోనే వికెట్లు తీయాల్సి ఉంటుందన్నాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు ఎక్కువ వికెట్లు కోల్పోకుండా ఉండడం, ప్రత్యర్థి జట్టులో వీలయినన్ని ఎక్కువ వికెట్లు సాధించడం తమ లక్ష్యమన్నాడు. ఇతరుల గురించి ఆలోచించకుండా విజయాలు సాధిస్తూ ఉండడమే తమ ధ్యేయమని అంటూ వరసగా విజయాలు సాధిస్తే తాము ఫైనల్‌కు చేరుకుంటామని వార్నర్ అన్నాడు. కాగా, ఒక కెప్టెన్‌గా తాను ఎప్పుడు మిగతా ఆటగాళ్లకు అందుబాటులో ఉంటానని అన్నాడు. మిగతా వాళ్లు తమ పని తాము చేస్తే తన పని సులభమవుతుందని అంటూ, ఏదయినా సరిగా లేదని అనిపిస్తే తాను సహచరులతో మాట్లాడుతానని చెప్పాడు. కాగా, గాయం కారణంగా ఇప్పటివరకు టోర్నమెంట్‌లో ఆడని యువరాజ్ సింగ్ శుక్రవారం మ్యాచ్‌లో ఆడే అవకాశముందని వార్నర్ సూచన ప్రాయంగా చెప్పాడు. యువరాజ్ ఫిట్‌గా ఉన్నాడా అని అడగ్గా, అవుననే అనుకుంటున్నానని ఆయన అన్నాడు.

చిత్రం డేవిడ్ వార్నర్