క్రీడాభూమి

మొదటి టెస్టు మనదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ ఊహించనట్టే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా మొదటి టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ఘనంగా ప్రారంభించింది. చివరిరోజు ఆసీస్ బ్యాట్స్‌మెన్ కడదాకా పోరాట పటిమ కనబరిచి కొంత ఉత్కంఠ పెంచినా, చివరికి విజయం భారత్‌నే వరించింది. మ్యాచ్ ప్రారంభంలో కోహ్లీ సేన తడబడినా, ఆ వెంటనే తెరుకొని ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశమివ్వకుండా జాగ్రత్త పడింది. మధ్యమధ్యలో ఇరు జట్లకు చెందిన కొంతమంది ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు ఆజ్యం పోసినా, అది స్నేహపూరితంగానే సాగింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా 50 ఏళ్ల తర్వాత భారత్ ఒకే ఏడాదిలో విదేశీ గడ్డపై మూడు టెస్ట్ విజయాలు సాధించింది. దీంతో పాటు మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది.
*
అడెలైడ్, డిసెంబర్ 10: చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మొదటి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆట చివరి రోజైన సోమవారం నాలుగు వికెట్లకు 104 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన ఆసీస్ మిగతా ఆరు వికెట్లను కాపాడుకోలేకపోయింది. 119.5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ తలా మూడేసి వికెట్లు పడగొట్టి, ఆసీస్ పరాజయాన్ని శాసించారు. చివరి రోజు ఆట మొదలైన తర్వాత, మరో 11 పరుగులు జోడించిన తర్వాత ఆసీస్ ఐదో వికెట్‌ను ట్రావిస్ హెడ్ రూపంలో కోల్పోయింది. అతను 62 బంతులు ఎదుర్కొని, 14 పరుగులు చేసి, ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో అజింక్య రహానే క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. జట్టును ఆదుకుంటాడనున్న షాన్ మార్ష్ పోరాటానికి జస్‌ప్రీత్ బుమ్రా తెరదించాడు. 166 బంతుల్లో, ఐదు ఫోర్లతో 60 పరుగులు చేసిన షాన్ మార్ష్ తీవ్రమైన ఒత్తిడిని అధిగమించలేక, వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌కు సులభమైన క్యాచ్‌నిచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్, వికెట్‌కీపర్ టిమ్ పైన్ 41 పరుగులు సాధించి, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనే పంత్‌కు చిక్కాడు. చివరిలో పాట్ కమిన్స్ (28), మిచెల్ స్టార్క్ (28) భారత బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచేందుకు ప్రయత్నించారు. నాథన్ లియాన్ 47 బంతులు ఎదుర్కొని, 38 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, చివరి వికెట్‌గా జొస్ హాజెల్‌వుడ్ పెవిలియన్ చేరాడు. అతను 43 బంతుల్లో 13 పరుగులు చేసి, అశ్విన్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 323 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు 291 పరుగుల వద్ద తెరపడింది. రెండు ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా ఆడి, సెంచరీ, అర్ధ సెంచరీలు నమోదు చేసిన భారత బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ ఒక్క ఏడాదిలోనే టీమిండియాకు విదేశాల్లో ఇది మూడో విజయం కావడం గమనార్హం.
కోహ్లీ ‘టాస్’ రికార్డ్..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు సారథ్యం వహించిన మ్యాచ్‌ల్లో 20 సార్లు టాస్ గెలవగా, భారత్‌ను 17 విజయాలు వరించాయ. మరో మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయ.

చిత్రం..ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన చతేశ్వర్ పుజారా