క్రీడాభూమి

బౌలింగ్ విధానం మార్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 12 : టీమిండియాతో జరిగే రెండో టెస్ట్‌కు ముందే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలని, బహుషా తన మనసులో ఏదో విషయం గురించి పోరాడుతూ ఉంటాడని, అవసరమె తే తనకు తగిన సూచనలిస్తానని ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ తెలిపారు. పెర్త్‌లో జరిగే రెండో టెస్ట్ పిచ్ పూర్తిగా పేస్‌కు సహకరి స్తుందని, తిరిగి ఆస్ట్రేలియా బౌలింగ్ గాడిలో పడనుందని ఈ సందర్భంగా జాన్సన్ బీబీసీతో మాట్లాడుతూ తమ జట్టుకు కొన్ని సూచనలు చేశాడు. స్టార్క్ ఆడెలైడ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసినా, చివర్లో భారత్ 31 పరుగులతో విజయం సాధించింది. శుక్రవారం పెర్త్ లో రెండో టెస్ట్ జరగనుంది. టెస్టుల్లో జాన్సన్ ఆస్ట్రేలియా బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా నిలి చాడు. రెండో టెస్టులో స్టార్క్ తప్పకుండా రాణిస్తాడని జా న్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గత 12 నెలలుగా స్టార్క్ తన కాలి చీలమండ గాయాలతో బాధపడుతున్నా డన్నా రు. స్టార్క్ ఎనిమిది టెస్టు మ్యాచుల్లో 29 వికెట్లు, నాథన్ లియాన్ 10 మ్యాచ్‌ల్లో 46 వికెట్లు, పాట్ కమ్మిన్స్ ఎనిమి ది మ్యాచుల్లో 40, జోష్ హజెల్‌వుడ్ ఎనిమిది మ్యాచుల్లో 30 వికెట్లు తీశారన్నారు. వీరందరి కంటే స్టార్క్ ఆడెలైడ్‌లో మంచి ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నాడు.
చిత్రం..మిచెల్ జాన్సన్