క్రీడాభూమి

వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో సింధూ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్వాంగ్స్యూ, డిసెంబర్ 12 : ఒలింపిక్ సిల్వర్ మెడల్ విజేత, షట్లర్ పీవీ సింధూ బుధవారం జరిగిన వరల్డ్ టూర్ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ షట్లర్ అకానె యమగూచిపై విజయం సాధించి శుభారంభం చేసింది. ఆట మొదలైన 27 నిమిషాల వరకు ఇద్దరు షట్లర్లు పోటాపోటీగా ఆడారు. మొదటగా సింధూ 6-11తో వెనుకబడినా, ఆ తర్వాత 19-19తో తిరిగి పుంజుకుంది. రెండో గేమ్‌లో అద్భుతంగా ఆడి 3-1తో దూసుకెళ్లింది. జపాన్ షట్లర్‌ను ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చివరికి 24-22 21-15తో ఆటను ముగించి విజయం సాధించింది.