క్రీడాభూమి

భారత్‌కు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 12: సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత మరోసారి సెమీస్ చేరడం ద్వారా అభిమానుల్లో టైటిల్ పట్ల ఆసక్తిని కలిగిస్తారా? లేక షరా మామూలే అన్నట్టు తీవ్రమైన ఒత్తిడికి లోనై, అవకాశాన్ని జార విడుచుకుంటారా అనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్నామని, దాడులకు ఉపక్రమించడమే తమ వ్యూహమని భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గ తంలో రక్షణాత్మక విధానాన్ని అనుసరిస్తూ, అ వకాశం దొరికినప్పుడు దాడులకు ఉపక్రమించాలన్నది భారత జట్టు వ్యూహంగా ఉండేది. కానీ, యువ కెప్టెన్ మన్‌ప్రీత్ బాధ్యత తీసుకు న్న తర్వాత పరిస్థితిలో చాలా మార్పు వచ్చిం ది. అందుకే, చాలాకాలంగా వేధిస్తూ వస్తున్న క్వార్టర్ ఫైనల్స్ భయాన్ని భారత జట్టు ఇప్పు డు సమర్థంగా ఎదుర్గోగలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గ్రూప్ దశలో టా పర్‌గా నిలిచి భారత్ క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదిస్తే, నెదర్లాండ్స్ 5-0 తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసి, క్వార్టర్స్ చేరింది. పాక్‌పై సా ధించిన ఘన విజయం ఇచ్చిన స్ఫూర్తితో నెదర్లాండ్స్ అదే దూకుడును ప్రదర్శిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. అయితే, రక్షణ విభాగం కూ డా పటిష్టంగా ఉండాలన్న సిద్ధాంతంతో, ఆ వై పు భారత్ దృష్టి కేంద్రీకరించింది. అందుకే, గురువారం నాటి భారత్, నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్స్ పోరు టైటిల్ యుద్ధాన్ని తలపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. గతంలో ఎదురైన వైఫల్యాలనుగానీ, విజయాలనుగానీ పట్టించుకోబోమని, రాబోయే మ్యాచ్‌లపై దృష్టి కేంద్రీకరిస్తామని భారత జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. నెదర్లాండ్స్‌ను ఓడించి, సెమీస్ చేరతామన్న ఆశాభావం వ్యక్తం చేసింది.