క్రీడాభూమి

బౌన్సీ పిచ్‌కి భయపడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 13: పెర్త్‌లో కొత్తగా నిర్మించిన ఆప్టస్ స్టేడియంలో పిచ్‌పై పచ్చిక ఉంటుందనీ, ఇది పేసర్లకు అనుకూలిస్తుందనీ వచ్చిన వార్తలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తేలిగ్గా తీసుకున్నాడు. పచ్చిక ఎక్కువగా ఉంటే, బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుంది కాబట్టి, ఆసీస్ పేసర్లు చెలరేగిపోయే అవకాశం ఉంది. అయితే, బౌన్సీ పిచ్‌కి తాము ఏమాత్రం భయపడమని, నిజానికి అలాంటి వికెట్‌పై ఆడేందుకు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నామని గురువారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. ఈ టెస్టును కూడా కైవసం చేసుకోవడం ద్వారా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు. అడెలైడ్‌లో జరిగిన మొదటి టెస్టును గెల్చుకున్న టీమిండియా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. స్టార్ స్పిన్నర్ అశ్విన్, సూపర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ గాయాల కారణంగా అందుబాటులో లేకపోయినప్పటికీ, టీమిండియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందన్నాడు. పెర్త్‌లో వికెట్ ఏ విధంగా మారుతుంది? ఎవరికి అనుకూలిస్తుంది? అనే ప్రశ్నలకు మ్యాచ్ ఆరంభమైన తర్వాతే సమాధానం లభిస్తుందని వ్యాఖ్యానించాడు. పిచ్ తీరు ఏ విధంగా ఉన్నప్పటికీ, తమ ఆట శైలి మారబోదని అన్నాడు.

చిత్రం..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ