క్రీడాభూమి

పెర్త్ టెస్టుకు అశ్విన్, రోహిత్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 13: ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలయ్యే రెండో టెస్టుకు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ గాయాల కారణంగా దూరమయ్యారు. వీరిద్దరూ ఈ టెస్టులో ఆడే అవకాశాలు లేవని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఓపెనర్ పృథ్వీ షా కాలి మడమ గాయం నుంచి ఇంకా కోలుకోక ముందే ఇద్దరు కీలక ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యతో దూరం కావడం భారత జట్టును వేధిస్తున్నది. రెండో టెస్టుకు ప్రకటించిన 13 మందితో కూడిన జట్టులో తెలుగు తేజం హనుమ విహారీ, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ పేర్లు ఉన్నాయి.
నాలుగు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కి ముందే కాలి మడమ బెణకడంతో పృథ్వీ షా జట్టుకు దూరమయ్యాడు. కాగా, అశ్విన్ పొత్తికడుపు కండరాల నొప్పితో బాధపడుతున్నాడని, అదే విధంగా రోహిత్‌ను వెన్నునొప్పి వేధిస్తున్నదని జట్టు మేనేజ్‌మెంట్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వీరికి వైద్యసేవలు అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తెలిపింది. జట్టు మేనేజ్‌మెంట్ అన్ని విధాలా ఆటగాళ్లకు సహాయసహకారాలు అందిస్తుందని తెలిపింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆసీస్‌తో ఎప్పుడు అందుబాటులో ఉంటారనేది ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించింది. మూడో టెస్టులో మాత్రం వీరు ఆడే అవకాశాలు లేవని తేల్చిచెప్పింది. ఈ సిరీస్‌లో మొదటి టెస్టును గెల్చుకున్న భారత్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన విషయం తెలిసిందే.
ఈ పిచ్‌పై పచ్చిక ఉంటుందని, కాబట్టి బంతి బౌన్స్ అవుతుందని క్యూరేటర్ బ్రెడ్ సిప్‌థోర్ప్
ప్రకటించాడు. బౌన్సీ వికెట్ సహజంగానే ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందని తెలిపాడు.
ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా పేసర్లపై ఆధారపడడంతో, వారికి అనుగుణంగానే
పిచ్‌ని రూపొందించారన్నది క్యూరేటర్ ప్రకటనతో స్పష్టమవుతున్నది.
రెండో టెస్టుకు ప్రకటించిన జట్టు ఇదే..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేష్ రాహుల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హునుమ విహారీ, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.
చిత్రం..పెర్త్ పిచ్‌ని పరిశీలిస్తున్న భారత ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ.