క్రీడాభూమి

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సింధు, నాకౌట్‌లో సమీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువాంగ్జు, డిసెంబర్ 14: ఒలింపిక్ రజత పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ టూర్ మహిళల విభాగంలో ఫైనల్స్‌లో చోటుదక్కించుకుంది. అదేవిధంగా పురుషుల విభాగంలో భారత షట్లర్ సమీర్ వర్మ తొలిసారిగా నాకౌట్‌లో చోటుదక్కించుకున్నాడు. శుక్రవారం టాప్ గ్రూప్-ఏలో జరిగిన పోటీలో సింధు వరల్డ్ నెంబర్ 12 క్రీడాకారిణి బీవెన్ ఝాంగ్‌ను 21-9, 21-15తో ఓడించింది. సమీర్‌వర్మ థాయిలాండ్‌కు చెందిన కంఠాఫోన్ వాంగ్‌చరోయెన్‌ను 21-9, 21-18 తేడాతో ఓడించాడు. ఓపెనింగ్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ 1 చాంపియన్ కెంటో మొమోటో చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న సమీర్ వర్మ గ్రూప్-బీలో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంతో నాకౌట్‌లో చోటుదక్కించుకున్నాడు.