క్రీడాభూమి

కంగారు లేకుండా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 14: భారత్‌తో నాలుగు టెస్టు సిరీస్‌లలో భాగంగా ఇప్పటికే అడెలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో సిరీస్‌ను 0-1తో కోల్పోయిన ఆతిధ్య ఆస్ట్రేలియా రెండో టెస్టులో సత్తా చాటుతామని చెప్పకనే చెప్పింది. శుక్రవారం పెర్త్‌లో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ తొలిరోజు తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆసిస్ 90 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 277 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. తొలుత టాస్ గెలిచిన ఆతిధ్య జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. పర్యాటక టీమిండియాలో గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఉమేష్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోగా, ఆసిస్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. రెండో టెస్టుకు టీమిండియా నలుగురు ఫాస్ట్‌బౌలర్లను జట్టులోకి తీసుకుని దాడికి ప్రత్యర్థిపై దాడికి యత్నించినా పెర్త్‌లోని పచ్చటి మైదానం ఆతిధ్య జట్టుకు బాగా కలిసొచ్చింది. అందరి అంచనాలను భిన్నంగా ఆరోన్ ఫించ్, మార్కస్ హ్యారిస్, మార్కస్ హ్యారిస్, ట్రావిస్ హెడ్ భారత బౌలర్లను ఎదుర్కొంటూ అద్భుతంగా రాణిస్తూ పరుగుల వరద సృష్టించారు. లంచ్ విరామ సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఆసిస్ 66 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆటను ప్రారంభించిన ఆసిస్ స్కోరు 100 దాటినా ఒక్క వికెట్ కూడా పడకపోవడం గమనార్హం. టీమిండియా బౌలర్ల సహనానికి ఇది ఒక పరీక్షగా నిలిచింది. ఆ తర్వాత టీ విరామ సమయానికి 53 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. తొలి సెషన్ బ్యాట్స్‌మెన్‌లదే ఆధిపత్యం కాగా, రెండో సెషన్‌లో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. మళ్లీ మూడో సెషన్‌లో బ్యాట్స్‌మెన్లు తమ దూకుడును మరింత పెంచారు. ఫలితంగా ఆసిస్ తొలిరోజు తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
ఓపెనర్ ఆరోన్ ఫించ్ 105 బంతులు ఎదుర్కొని 6 బౌండరీలతో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అయితే, మంచి దూకుడుతో ఉన్న ఫించ్ 35.2 ఓవర్‌లో జట్టు స్కోరు 112 పరుగుల వద్ద ఉన్నపుడు జస్ప్రీత్ బుమ్రా చేతిలో ఎల్‌బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఉస్మాన్ ఖాజా 38 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. తొలినుంచి క్రీజులో బలంగా స్థిరపడిన మరో ఓపెనర్ మార్కస్ హ్యారిస్ 141 బంతులు ఎదుర్కొని 10 బౌండరీలతో 70 పరుగులు చేశాడు. హనుమ విహారి బౌలింగ్‌లో అజింక్య రహానే హ్యారిస్‌ను పెవిలియన్ దారిపట్టించాడు. 16 బంతులు ఎదుర్కొన్న పీటర్ హ్యాండ్స్‌కాంబ్ 7 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. సువాన్ మార్ష్ 98 బంతులు ఎదుర్కొని 45 6 బౌండరీలతో 45 పరుగులు చేసి హనుమ విహారి బౌలింగ్‌లో అజింక్య రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 80 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్ హెడ్ 6 బౌండరీలతో 58 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మహమ్మద్ షమీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. తొలిరోజు ఆట ముగిసేసరికి కెప్టెన్-వికెట్ కీపర్ టిమ్ పైన్ 16, ప్యాట్ కమిన్స్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో హనుమ విహారి 14 ఓవర్లలో 53, ఇషాంత్ శర్మ 16 ఓవర్లలో 35 పరుగులిచ్చి తలో రెండు వికెట్లు పడగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా 22 ఓవర్లలో 41, ఉమేష్ యాదవ్ 18 ఓవర్లలో 68 పరుగులిచ్చి చెరో వికెట్ తీసుకున్నారు. ఇదిలావుండగా, ఆటపై పట్టు సాధించాలంటే నిలకడగా ఆడుతున్న ఆసిస్ తొలి ఇన్నింగ్స్ రెండోరోజు త్వరితగతిన వికెట్లను పడగొడితేనే టీమిండియాకు మేలు జరుగుతుంది.