క్రీడాభూమి

అమ్ముడుకాని క్రికెటర్లకు ఫిబ్రవరి 6న వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 15: ఐపిఎల్ కోసం మంగళవారం నిర్వహించిన డ్రాఫ్ట్‌లో పుణె, రాజ్‌కోట్ జట్లు చెరి ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉండగా, వేలంలో ఎవరూ పాడుకోని క్రికెటర్లకు, మిగతా వారితో కలిసి ఫిబ్రవరి 6న వేలాన్ని నిర్వహిస్తారు. 2013 ఐపిఎల్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుపై సుప్రీం కోర్టు విచారణ జరిపి, దోషులను నిర్ధారిస్తూ, వారికి శిక్షలను ఖరారు చేసే బాధ్యతను మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని కమిటీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాలపై జీవితకాల సస్పెన్షన్ వేటు వేసింది. అంతేగాక, స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా చెన్నై, రాజస్థాన్ జట్లను రెండు సంవత్సరాలపాటు ఐపిఎల్‌లో ఆడకుండా నిషేధం విధించింది. దీనితో 2016, 2017 సంవత్సరాల్లో ఐపిఎల్ కేవలం ఆరు జట్లతో ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) రివర్డ్ బిడ్డింగ్ విధానంలో పుణే, రాజ్‌కోట్ జట్లను ఎంపిక చేసింది. ఈ రెండు జట్లకు ఆటగాళ్లు అవసరంకాగా, సస్పెన్షన్ కారణంగా చెన్నై, రాజస్థాన్ జట్లలోని 50 మంది క్రికెటర్లు తమ కాంట్రాక్టులను కోల్పోయారు. వీరిలో 33 మంది భారతీయులుకాగా, 17 మంది విదేశీయులు. కాంట్రాక్టు చేజారిన వీరి కోసం ఐపిఎల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం డ్రాఫ్ట్ విధానంలో వేలాన్ని నిర్వహించారు. పుణె, రాజ్‌కోట్ చెరి ఐదుగురు చొప్పున పది మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. దీనితో మిగతా ఆటగాళ్ల పేర్లను ఏటా జరిగే సాధారణ ఐపిఎల్ వేలంలో చేర్చి, ఫిబ్రవరి 6న వేలాన్ని నిర్వహిస్తారు.
డ్రాఫ్ట్‌లో అవకాశం దక్కని విదేశీ భారత ఆటగాళ్లలో అభిషేక్ నాయర్, ఆశిష్ నెహ్రా, దీపక్ హుడా, ధవళ్ కులకర్ణి, ఇర్ఫాన్ పఠాన్, మోహిత్ శర్మ, సంజూ శాంసన్, స్టువర్ట్ బిన్నీ వంటి సమర్థులున్నారు. అదే విధంగా క్రీడాకారుల్లో టిమ్ సౌథీ (న్యూజిలాండ్), కేల్ అబోట్ (దక్షిణాఫ్రికా), షేన్ వాట్సన్, మైఖేల్ హస్సీ (ఆస్ట్రేలియా), డ్వెయిన్ స్మిత్ (వెస్టిండీస్) వంటి మేటి స్టార్లు ఉన్నారు. వీరిలో ఎంత మంది సాధారణ వేలంలో అమ్ముడవుతారో, ఎంత మంది అవకాశం లభించక నిరాశ చెందుతారో చూడాలి.