క్రీడాభూమి

హాకీ విశ్వవిజేత బెల్జియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 16: ప్రపంచ వరల్డ్ కప్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్ టైటిల్ విజేతగా బెల్జియం నిలిచింది. ఆదివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో మాజీ చాంపియన్ నెదర్లాండ్‌ను ఓడించి తొలిసారిగా విశ్వవిజేతగా ఆవిర్భవించింది. 2016 రియో ఒలింపిక్ రజత పతక విజేతగా ఉన్న బెల్జియం ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్ ద్వారా ప్రత్యర్థిని 3-2 తేడాతో ఓడించి టైటిల్‌ను ముద్దాడి సరికొత్త రికార్డును నెలకొల్పింది. బెల్జియం గోల్‌కీపర్ వినె్సంట్ వనాస్చ్ తమ జట్టును విజయపథాన నిలిపేందుకు కీలక భూమిక పోషించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను 6-0తో మట్టి కరిపించిన బెల్జియం ఏకపక్షంగా సాగిన పోరు ద్వారా తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. ఇపుడు ఇదే జట్జు తొలిసారిగా విశ్వవిజేతగా ఆవిర్భవించింది. నెదర్లాండ్ గత సీజన్‌లో టైటిల్ విజేతగా నిలబడగా, బెల్జియం ఐదో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు తిలకించారు.