క్రీడాభూమి

‘పెర్త్’లో ఆసిస్ పెత్తనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, డిసెంబర్ 16: భారత్‌తో అడెలైడ్ మైదానంలో జరిగిన తొలి టెస్టు సిరీస్‌ను 31 పరుగుల తేడాతో చేజార్చుకున్న ఆతిధ్య ఆస్ట్రేలియా పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుపై పట్టు బిగించింది. మూడోరోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ ముగిసేసరికి 48 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ ఆట ముగిసేసరికి మొత్తంగా 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 69 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా 105.5 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే 105 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 6 బౌండరీల సహాయంతో 51 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 46 బంతులు ఎదుర్కొన్న హనుమ విహారి 2 బౌండరీలతో 20 పరుగులు చేసి హాజల్‌వుడ్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 257 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 13 బౌండరీల సహాయంతో 123 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ త్వరితగతిన సెంచరీ చేసిన అరుదైన రికార్డు సృష్టించాడు. 1 బంతిని ఎదుర్కొన్న మహమ్మద్ షమీ పరుగులేమీ చేయకుండానే నాథన్ లియాన్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇషాంత్ శర్మ 11 బంతులను ఎదుర్కొని 1 పరుగు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 50 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్, 2 బౌండరీల సహాయంతో 36 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా 4 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 4 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఖాజాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఉమేష్ యాదవ్ 31 బంతులు ఎదుర్కొని 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసిస్ బౌలర్లలో నాథన్ లియాన్ 34.5 ఓవర్లలో 67 పరుగులిచ్చి అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్ 24 ఓవర్లలో 79, జొష్ హాజల్‌వుడ్ 21 ఓవర్లలో 66 పరుగులిచ్చి తలో రెండేసి వికెట్లు తీసుకున్నారు. ప్యాట్ కమిన్స్ 26 ఓవర్లలో 60 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆతిధ్య ఆసిస్ బ్యాట్స్‌మెన్‌లు ఆదినుంచే దూకుడును ప్రదర్శించారు. అయితే, వీరి దూకుడుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేశారు. ఏ బ్యాట్స్‌మెన్ కూడా పరుగుల వరద పారించకుండా వ్యవహరించారు. దీంతో ఆట ముగిసేసరికి ఆసిస్ 48 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఓపెనర్ మార్కస్ హ్యారిస్ 56 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 20 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా చేతిలో బౌల్డ్ అయ్యాడు. 11 బంతులు ఎదుర్కొన్న షాన్ మార్ష్ 1 బౌండరీతో 5 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. పీటర్ హ్యాండ్స్‌కాంబ్ 14 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలతో 13 పరుగులు చేసి ఇషాంత్ శర్మ చేతిలో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ట్రావిస్ హెడ్ 49 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 19 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఇషాంత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 30 బంతులు ఎదుర్కొన్న అరోన్ ఫించ్ 5 బౌండరీలతో 25 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. రెండో ఇన్నింగ్స్ ఆట ముగిసేసరికి ఉస్మాన్ ఖాజా 41, కెప్టెన్-వికెట్ కీపర్ టిమ్ పైన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 10 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇషాంత్ శర్మ 9 ఓవర్లలో 33, జస్ప్రీత్ బుమ్రా 13 ఓవర్లలో 25 పరుగులిచ్చి తలో వికెట్ పడగొట్టారు.

చిత్రం.. నాథన్ లియాన్ 67/5