క్రీడాభూమి

స్వర్ణ సింధూరం ..అద్భుత విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ సాధించిన తొలి క్రీడాకారిణిగా తెలుగుతేజం
గువాంగ్‌జౌ, డిసెంబర్ 16: తెలుగుతేజం, భారత మహిళా స్టార్ షట్లర్ చరిత్ర సృష్టించింది. ఎంతోకాలం నుంచి ఊరిస్తున్న చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. తొలిసారిగా అరుదైన రికార్డును తన ఖాతాలో జమ చేసుకుంది. బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్‌లో గోల్డ్‌మెడల్ అందుకున్న తొలి భారత షట్లర్‌గా రికార్డు పుటల్లో చోటు సంపాదించుకుంది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో గత ఏడాది వరల్డ్ చాంపియన్, జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒహుకురాపై ఘన విజయం సాధించింది. గత ఏడాది బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన అకానే యమగూచితో పోటీపడి రజత పతకంతో సరిపెట్టుకున్న సింధు ఈసారి ఏమాత్రం పట్టు సడలకుండా తన సత్తా చాటి, ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో పూర్తి ఆధిపత్యం చెలాయించిన సింధు 21-19, 21-17 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఈ గెలుపుతో తెలుగుతేజం కెరీర్‌లో మొత్తం 14 టైటిళ్లు అందుకోగా, ఈ ఏడాది ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ఏడాది వరల్డ్ జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్, కామనె్వల్త్ గేమ్స్, థాయిలాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్‌లో రజత పతకాలు కైవసం చేసుకుంది.
ఫైనల్ ఫోబియా తీరినట్టే!: సింధు
ప్రపంచ టూర్ టైటిల్‌లో ఇప్పటివరకు ఉన్న ‘ఫైనల్ ఫోబియా’ తీరినట్టేనని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వ్యాఖ్యానించింది. బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్‌ను అందుకున్న తర్వాత మీడియాతో ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే పెద్ద టైటిళ్ల పోరులో సత్తా చాటలేననే ప్రశ్న ఇక తలెత్తదని అభిప్రాయపడింది. ఈ ఏడాది తాను సాధించిన అతి పెద్ద విజయం చిరస్మరణీయ ఘట్టంగా నిలుస్తుందని పేర్కొంది. ఈ గెలుపుతో తాను ఎంతో గర్వంగా ఫీలవుతున్నానని, గోల్డ్ మెడల్ సాధించగలననే గట్టి నమ్మకం, అంతకు మించిన బలమైన విశ్వాసం వచ్చాయని తెలిపింది. వరల్డ్ టూర్ టైటిల్‌ను తొలిసారిగా అందుకున్న భారత షట్లర్‌గా రికార్డు పుటల్లో చోటుదక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని, ఈ ఏడాది అతి పెద్ద టైటిల్ అందుకోవడంతో మాటలు కూడా రావడం లేదని అంది.
ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ లక్ష్యం: గోపీచంద్
వరల్డ్ టూర్ ఫైనల్‌లో టైటిల్ తొలిసారి అందుకున్న పీవీ సింధు వచ్చే ఏడాది జరిగే ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లోనూ టైటిల్‌ను సాధించాలని బాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 1980లో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌ను తొలిసారిగా భారత స్టార్ షట్లర్ ప్రకాష్ పదుకొనే అందుకోగా, 2001లో పుల్లెల గోపీచంద్ కైవసం చేసుకున్నాడు. మళ్లీ ఇప్పటివరకు భారత షట్లర్లు ఎవరూ ఈ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకోలేదు. 18 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఈ టైటిల్‌ను సాధించడం తమ తదుపరి లక్ష్యమని గోపీచంద్ అన్నాడు.
‘బాయ్’ నగదు పురస్కారం
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ విజేతగా నిలిచిన తెలుగుతేజం పీవీ సింధుకు భారత బాడ్మింటన్ అసోసియేషన్ 10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.