క్రీడాభూమి

జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత్‌కు నాలుగో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జర్మనీ, మే 6: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యాన జర్మనీలోని సహ్ల్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత షూటర్లు మొత్తం పది పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. వీటిలో మూడు పసిడి పతకాలు, నాలుగు రజత పతకాలు, మరో మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు జరిగిన ఈ టోర్నమెంట్‌లో 48 దేశాలకు చెందిన 585 మంది జూనియర్ షూటర్లు పాల్గొనగా, పతకాల పట్టికలో 24 దేశాలకు మాత్రమే స్థానం దక్కింది. ఈ పట్టికలో ఇటలీ మొత్తం 12 (7 స్వర్ణ, 4 రజతాలు, ఒక కాంస్య) పతకంతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, 5 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలతో రష్యా ద్వితీయ స్థానంలోనూ, 5 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో జర్మనీ తృతీయ స్థానంలోనూ నిలిచాయి. రీతూరాజ్ సింగ్ చక్కగా రాణించి పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్తోల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో భారత్‌కు రెండు పసిడి పతకాలను అందించగా, పిస్తోల్ ఈవెంట్లలో శివమ్ శుక్లా ఒక పసిడి పతకాన్ని, మరో రజత పతకాన్ని అందించాడు. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్తోల్ ఈవెంట్‌లో శివమ్ శుక్లా ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ పతకాన్ని సాధించడంలో విఫలమయ్యాడు. కాగా, టీమిండియాకు అర్జున్ దాస్ ఒక పసిడి పతకాన్ని, మరో కాంస్య పతకాన్ని అందిం