క్రీడాభూమి

ఇక చాలు.. గేమ్ ఆడండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు ఎదురెదురుగా తారసపడ్డారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్ రన్ తీస్తుండగా కోహ్లీ ఎదురుపడ్డాడు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. ఇద్దరూ వాదులాడుకోవడంతో అంపైర్ కలుగజేసుకొని సర్ది చెప్పారూ. ‘ఇకచాలు.. గేమ్ ఆడండి.. మీరిద్దరూ కెప్టెన్లు’ అని హెచ్చరించాడు. ఈ వ్యాఖ్యలపై ఆసీస్ కెప్టెన్ స్పందిస్తూ మేమిద్దరం కేవలం మాట్లాడుకుంటున్నామని, కోహ్లీ కూల్‌గా ఉండాలని సూచించాడు. దీంతో కోహ్లీ నవ్వుతూ ఫీల్డింగ్ పొజిషన్‌కి వెళ్లడంతో ఈ ఘటన అభిమానుల్లోనూ నవ్వులు పూయంచింది!