క్రీడాభూమి

పాకిస్తాన్ క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా ఆర్థర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 6: పాకిస్తాన్ క్రికెట్ జట్టు నూతన కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ మికీ ఆర్థర్ (47) నియమితుడయ్యాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కోచ్ పదవికి వకార్ యూనిస్ రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో వకార్ స్థానంలో శుక్రవారం ఆర్థర్‌ను పాక్ జట్టు కొత్త కోచ్‌గా నియమించారు. ఈ విషయమై గవర్నర్ల బోర్డు సమావేశంలో విస్తృత చర్చ జరిగిందని, ఆ తర్వాత ఆర్థర్‌తో సంప్రదింపులు జరపడంతో అతను కోచ్ పదవిని చేపట్టేందుకు అంగీకరించాడని పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆర్థర్ ఈ నెలాఖరులో పాక్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడని భావిస్తున్నామని, ప్రస్తుతం అతనితో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు నియమ, నిబంధనలను ఖరారు చేస్తున్నామని పిసిబి ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆర్థర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో కరాచీ కింగ్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పాక్ జట్టుకు సంబంధించి తాను చేసిన సూచనల్లో ఒక్కదానిని కూడా పిసిబి అంగీకరించడం లేదని పేర్కొంటూ వకార్ యూనిస్ కోచ్ పదవికి రాజీనామా చేయడంతో అతని స్థానంలో ఆర్థర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. వకార్ రాజీనామా అనంతరం పాక్ జట్టుకు కొత్త కోచ్‌ను నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానించిన పిసిబి, ఈ విషయమై తమకు సిఫారసులు చేసేందుకు మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, రమీజ్ రాజా, ఫైసల్ మీర్జాలతో కమిటీని కూడా నియమించింది. దీంతో ఇంతకుముందు ఈ పదవిని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు స్టూవర్ట్ లాకు ఇవ్వాలని ప్రతిపాదించగా, ప్రస్తుతం తాను కోచ్‌గా బాధ్యతలు స్వీకరించలేనంటూ అతను తోసిపుచ్చాడు. అలాగే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు పీటర్ మూర్స్ కూడా పిసిబి ప్రతిపాదనను తోసిపుచ్చినప్పటికీ పాక్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు మికీ ఆర్థర్ అంగీకరించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 110 మ్యాచ్‌లు ఆడిన ఆర్థర్ 2005-10 మధ్య కాలంలో ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరించి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సఫారీలను అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానానికి చేర్చాడు. ఆర్థర్ కోచ్‌గా ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా జట్టు వరుసగా 13 అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లలో విజయం సాధించి అంతకుముందు ఆస్ట్రేలియా నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది. దక్షిణాఫ్రికా జట్టు కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత ఆర్థర్ 2011 నుంచి 2013 వరకు ఆస్ట్రేలియా జట్టుకు, ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్)లో ఢాకా గ్లాడియేటర్స్ జట్టుకు కోచ్‌గా సేవలు అందించిన విషయం విదితమే.