క్రీడాభూమి

ఫైనల్‌కు సిబుల్కోవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 6: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్లొవేకియాకు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి డొమినికా సిబుల్కోవా ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఆమె అమెరికాకు చెందిన మరో అన్‌సీడెడ్ క్రీడాకారిణి లూయిసా చిరికోపై విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సిబుల్కోవా 6-1, 6-1 తేడాతో చిరికోను మట్టికరిపించింది.
సెమీస్‌కు ముర్రే, నాదల్
కాగా పురుషుల సింగిల్స్ విభాగంలో బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రేతో పాటు ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్, జపాన్ ఆటగాడు కై నిషికోరీ సెమీ ఫైనల్స్‌లో ప్రవేశించారు. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన ముర్రే క్వార్టర్ ఫైనల్‌లో 6-3, 6-2 తేడాతో ఎనిమిదో సీడ్ ఆటగాడు థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై సునాయాసంగా గెలుపొందగా, ఐదో సీడ్ రాఫెల్ నాదల్ 6-0, 4-6, 6-3 తేడాతో అన్‌సీడెడ్ ఆటగాడు జావో సౌసా (పోర్చుగల్)పై, ఆరో సీడ్ కై నిషికోరీ 6-7, 7-6, 6-3 తేడాతో నిక్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా)పై చెమటోడ్చి గెలుపొందారు.