క్రీడాభూమి

లయన్స్‌కు మరో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న గుజరాత్ లయన్స్ జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి షాక్ ఇచ్చింది. గత నెల 21వ తేదీన గుజరాత్ లయన్స్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజాగా శుక్రవారం ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మరోసారి ఆ జట్టును 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి సత్తా చాటుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు సాధించగా, 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు సాధించిన సన్‌రైజర్స్ మరో 6 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌కు ఇది ఐదో విజయం కాగా, గుజరాత్ లయన్స్‌కు పది మ్యాచ్‌లలో ఇది నాలుగో ఓటమి. దీంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
అంతకుముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారభించిన గుజరాత్ లయన్స్ జట్టులో కెప్టెన్ సురేష్ రైనా (10 బంతుల్లో 20 పరుగులు) మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లంతా ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు డ్వెయిన్ స్మిత్ (1), బ్రెండన్ మెక్‌కలమ్ (7)తో పాటు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (0) త్వరత్వరగా నిష్క్రమించడంతో గుజరాత్ లయన్స్ ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ క్రీజ్‌లో నిలదొక్కుకుని బాధ్యతాయుతంగా ఆడాడు. డ్వెయిన్ బ్రావో (20 బంతుల్లో 18 పరుగులు)తో కలసి ఐదో వికెట్‌కు 45 పరుగులు, రవీంద్ర జడేజా (13 బంతుల్లో 18 పరుగులు)తో కలసి ఆరో వికెట్‌కు మరో 27 పరుగులు జోడించిన ఫించ్ 42 బంతుల్లో 51 పరుగులు సాధించి అజేయంగా నిలువగా, ప్రవీణ్ కుమార్ (4 బంతుల్లో 6 పరుగులు) కూడా నాటౌట్‌గా నిలిచాడు. దీంతో గుజరాత్ లయన్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు రాబట్టింది.
సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ముస్త్ఫాజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు సాధించగా, బ్రరుూందర్ సరన్, మోజెస్ హెన్రిక్స్ ఒక్కో వికెట్ అందుకున్నారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్‌రైజర్స్ జట్టులో కాన్ విలియమ్‌సన్ (6), మోజెస్ హెన్రిక్స్ (14), యువరాజ్ సింగ్ (5) విఫలమైనప్పటికీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (24)తో పాటు దీపక్ హుడా (18), శిఖర్ ధావన్ (47-నాటౌట్), నమన్ ఓజా (9-నాటౌట్) రాణించారు. దీంతో 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు సాధించిన సన్‌రైజర్స్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌ను మట్టికరిపించింది. ఇంతకుముందు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో పరాజయాలను ఎదుర్కొన్న గుజరాత్ లయన్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి.

సంక్షిప్తంగా స్కోర్లు
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 126/6 (ఆరోన్ ఫించ్ 51-నాటౌట్, సురేష్ రైనా 20, డ్వెయిన్ బ్రావో 18, రవీంద్ర జడేజా 18). వికెట్ల పతనం: ం: 1-2, 2-24, 3-25, 4-34, 5-79, 6-106. బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-1-28-2, ఆశిష్ నెహ్రా 4-1-23-0, ముస్త్ఫాజుర్ రెహ్మాన్ 4-0-17-2, బ్రరుూందర్ సరన్ 3-0-21-1, మోజెస్ హెన్రిక్స్ 3-0-24-1, యువరాజ్ సింగ్ 2-0-13-0.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: 19 ఓవర్లలో 129/5 (శిఖర్ ధావన్ 47-నాటౌట్, డేవిడ్ వార్నర్ 24, దీపక్ హుడా 18, మోజెస్ హెన్రిక్స్ 14). వికెట్ల పతనం: 1-26, 2-33, 3-55, 4-81, 5-108. బౌలింగ్: డ్వెయిన్ బ్రావో 3-0-14-2, ధవళ్ కులకర్ణి 4-1-17-2, ప్రవీణ్ కుమార్ 4-0-28-1, ప్రదీప్ సంగ్వాన్ 2-0-28-0, షివిల్ కౌశిక్ 4-0-25-0, రవీంద్ర జడేజా 2-0-14-0.

ఆరోన్ ఫించ్ అర్ధ శతకం వృథా

ఐపిఎల్‌లో నేడు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
రైజింగ్ పుణె సూపర్ జెయంట్స్
బెంగళూరులో సాయంత్రం 4 గంటల నుంచి
ఢిల్లీ డేర్‌డెవిల్స్
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
మొహాలీలో రాత్రి 8 గంటల నుంచి