క్రీడాభూమి

సోల్డ్రాను ఓడిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 7: ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో తన తర్వాతి ప్రత్యర్థి ఆండ్రెజ్ సోల్ట్రాను ఓడిస్తానని భారత బాక్సర్ విజేందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. జూన్ 11న జరిగే ఆ ఫైట్ కోసం తాను ప్రాక్టీస్ చేస్తున్నానని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత ఐదు ఫైట్స్‌లో వరుసగా సోనీ వైటింగ్, డీన్ గిలెన్, సమెట్ హ్యుసెనొవ్, అలెగ్జాండర్ హోర్వత్, మోటిగెజ్ రోయర్‌లను ఓడించిన విజేందర్ మరో విజయాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రొఫెషనల్‌గా మారక ముందు 98 ఫైట్స్‌లో 82 విజయాలను నమోదు చేసిన సోల్డ్రాను తక్కువ అంచనా వేయడం లేదని, అతని ఫైట్స్‌కు సంబంధించిన వీడియోలు చూస్తున్నానని విజేందర్ అన్నాడు. తనకు ఎదురయ్యే బలమైన ప్రత్యర్థుల్లో సోల్డ్రా ఒకడని వ్యాఖ్యానించాడు. అజేయ రికార్డును కొనసాగించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందన్న విషయం తనకు తెలుసునని అన్నాడు. అయితే, సోల్డ్రాను నిలువరించే సామర్థ్యం తనకు ఉందని చెప్పాడు. ఈ ఫైట్ తర్వాత, స్వదేశంలో ఆసియా టైటిల్ కోసం పోటీపడతానని, అందుకే సోల్డ్రాతో పోరును తాను కీలకంగా భావిస్తున్నానని అన్నాడు. ఇలావుంటే, మరో ఇంటర్వ్యూలో మాట్లాడిన సోల్ట్రా ఈ ఫైట్‌లో తాను విజేందర్‌ను చిత్తుచేస్తానని అన్నాడు. తనను విజేందర్ నిలువరించగలడా అంటూ సవాలు విసిరాడు. అతని విజయపరంపరలకు తాను బ్రేక్ వేస్తానని అన్నాడు. ప్రత్యర్థి కంటే తాను చాలా మె రుగైన స్థితిలో ఉన్నానని, అనుభవం కూడా తనకు ఎక్కువని పేర్కొన్నాడు.