క్రీడాభూమి

మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్ చేరిన ముర్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 7: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే ఫైనల్‌కు దూకుకెళ్లాడు. నాదల్‌తో అతను తలపడడం ఇది 24వ సారి. గతంలో కేవలం ఆరు పర్యాయాలు మాత్రమే గెలిచిన ముర్రే ఏడో విజయాన్ని మోదు చేశాడు. హోరాహోరీగా సాగుతుందని ఊహించిన ఈ మ్యాచ్ అందుకు భిన్నంగా రెండు సెట్లలో ముగిసింది. మొదటి సెట్‌లో నాదల్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొన్న ముర్రే 7-5 తేడాతో దానిని సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో ముర్రే విజృంభణకు నాదల్ నుంచి సరైన సమాధానం లేకపోయింది. రెండో సెట్‌ను 6-4 తేడాతో తన ఖాతాలో వేసుకుకొని ముర్రే ఫైనల్‌లో స్థానం సంపాదించాడు.
సాన్‌టినా ఓటమి
మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ పరాజయాన్ని ఎదుర్కొంది. మరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న వీరు ఫైనల్‌లో కరోలిన్ గార్సియా, క్రిస్టినా మడెనొకొవా చేతిలో 4-6, 1-6 తేడాతో ఓటమి పాలయ్యారు. సాన్‌టినా జోడీకే విజయావకాశాలు ఉన్నాయని క్రీడా పండితులు పేర్కొన్నప్పటికీ, ఫలితం గార్సియా, క్రిస్టినా జోడీకే దక్కింది. కాగా, మహిళల సింగిల్స్ విభాగంలో డొమినికా సిబుల్కొవా, సిమోనా హాలెప్ ఫైనల్ చేరారు. సిబుల్కొవా 6-1, 6-1 తేడాతో సొరానా సిర్‌స్టియాను చిత్తుచేసిన విషయం తెలిసిందే. మరో సెమీ ఫైనల్‌లో హాలెప్ 6-2, 6-0 తేడాతో ఆస్ట్రేలియా సీనియర్ క్రీడాకారిణి సమంతా స్టొసుర్‌పై సులభంగా గెలిచింది.