క్రీడాభూమి

ఆధిపత్యం ఎవరిదో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం
రాత్రి 8 గంటలకు
మ్యాచ్ మొదలు
--
కోల్‌కతా, మే 7: పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలు ఆక్రమించిన కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగుతున్నది. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం జరిగే ఐపిఎల్ గ్రూప్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు పరస్పరం ఢీకొంటున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠను సృష్టిస్తున్నది. మూడు వరుస పరాజయాలతో కంగుతిన్న గుజరాత్ లయన్స్ మళ్లీ గాడిలో పడాలన్న పట్టుదలతో ఉంది. అయితే, సురేష్ రైనా నాయకత్వంలోని ఈ జట్టుకు గౌతం గంభీర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నైట్ రైడర్స్ గట్టిపోటీనివ్వడం ఖాయం. రెండు జట్లు చెరి 12 పాయింట్లు సంపాదించినప్పటికీ, నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్‌లే ఆడింది. గుజరాత్ లయన్స్ పది మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సంపాదించింది. ఐపిఎల్‌లో చాలా జట్లు విదేశీ ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రతిభపై ఆధారపడి బరిలోకి దిగుతుండగా, అందుకు భిన్నంగా నైట్ రైడర్స్‌లో నలుగురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ భారతీయులే. వికెట్‌కీపర్‌గా కూడా సేవలు అందిస్తున్న రాబిన్ ఉతప్పతో కలిసి, కెప్టెన్ గౌతం గంభీర్ తొలి వికెట్‌కు చక్కటి భాగస్వామ్యాన్ని అందిస్తున్నాడు. మూడు, నాలుగు స్థానాల్లో మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్ జట్టు బ్యాటింగ్ బలాన్ని పెంచుతున్నారు. స్లాగ్ ఓవర్లలో యూసుఫ్ పఠాన్, అండ్రె రసెల్ అండ జట్టుకు ఉంది. వీరంతా వేగంగా పరుగులు రాబట్టగల సమర్థులే. నైట్ రైడర్స్‌తో పోలిస్తే గుజరాత్ లయన్స్ బ్యాటింగ్ ఆర్డర్ అదే స్థాయిలో లేదు. అయితే, కెప్టెన్ రైనాతోపాటు, డ్వెయిన్ స్మిత్, బ్రెండన్ మెక్‌కలమ్, ఆరోన్ ఫించ్, దినేష్ కార్తీక్ వంటి మేటి బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఉన్నారు. వీరు నిలకడగా ఆడితే గుజరాత్ లయన్స్ మళ్లీ విజయాల బాట పడుతుంది. బౌలింగ్ విభాగానికి వస్తే, నైట్ రైడర్స్‌లో పీయూష్ చావ్లా, ఉమేష్ యాదవ్, మోర్న్ మోర్కెల్, సునీల్ నారైన్ తదితరులు కీలక భూమిక పోషిస్తున్నారు. గుజరాత్ జట్టులో ప్రవీణ్ కుమార్, ‘చైనామన్’ బౌలర్ శివిల్ కౌశిక్, ధవళ్ కులకర్ణి, అమిత్ మిశ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసురుతున్నారు. నైట్ నైడర్స్‌కు షకీల్ అల్ హసన్ రూపంలో సమర్థుడైన ఆల్‌రౌండర్ ఉన్నాడు. గుజరాత్ లయన్స్‌లో రవీంద్ర జడేజా, డ్వెయిన్ బ్రేవో చెప్పుకోదగ్గ ఆల్‌రౌండర్లు. ఆటగాళ్ల ప్రతిభాపాటవాలను పరిగణలోకి తీసుకుంటే, నైట్ రైడర్స్‌కు దీటుగానే గుజరాత్ లయన్స్ కనిపిస్తున్నది. కానీ, నిలకడగా ఆడడంలో నైట్ రైడర్స్ క్రీడాకారులదే పైచేయి. దీనికి తోడు హోం గ్రౌండ్ మ్యాచ్ ఆడడం కూడా నైట్ రైడర్స్‌కు లాభించే అంశం.