క్రీడాభూమి

ఐదుగురు ఆటగాళ్లు 39 కోట్ల రూపాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 15: ఐపిఎల్ డ్రాఫ్ట్‌లో పాల్గొన్న రాజ్‌కోట్, పుణె జట్టు చెరి ఐదుగురు ఆటగాళ్లను 39 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాయి. నిబంధనలను అనుసరించి ఈ జట్ల వద్ద చెరి 27 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ మొత్తంతోనే వారు ఫిబ్రవరి 6న జరిగే సాధారణ వేలంలో ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకు తొమ్మిదో ఐపిఎల్ టోర్నీ జరుగుతుంది. గతంలో మాదిరిగానే ఎనిమిది జట్లు టోర్నీలో పాల్గొంటాయని ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పాడు. రాజ్‌కోట్‌ను కొనుగోలు చేసిన ఇంటెక్స్ మొబైల్ కంపెనీ యజమాని కేశవ్ బన్సాల్, పుణెను కొన్న న్యూ రైజింగ్ సహ భాగస్వామి సుబ్రతో తాలూక్దార్‌తో కలిసి ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో పాల్గొన్న శుక్లా ఆతర్వాత విలేఖరులతో మాట్లాడుతూ తొమ్మిదో ఐపిఎల్‌లో మొదటి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనే జరుగుతాయని అన్నాడు. ఒక ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి ఆటగాళ్ల అమ్మకాలు మూడు దఫాలుగా సాగుతాయని తెలిపాడు. మొదటి విడత అమ్మకాలు మంగళవారం నుంచి మొదలయ్యాయని, ఈనెల 31వ తేదీ వరకూ కొనసాగుతాయని పేర్కొన్నాడు. రెండో విడత అమ్మకాలు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 22 వరకూ ఉంటాయన్నాడు. ఫిబ్రవరి 6న సాధారణ వేలం జరుగుతుందని, ఆదే నెల 8 నుంచి 19 వరకు ఫ్రాంచైజీల మధ్య చివరి కొనుగోళ్లు, అమ్మకాల ప్రక్రియ మొదలవుతుందని చెప్పాడు. ఫ్రాంచైజీలకు వర్క్‌షాప్‌ను జనవరి 13, 14 తేదీల్లో శ్రీనగర్‌లో నిర్వహించనున్నట్టు తెలిపాడు. ఐపిఎల్‌లో పాకిస్తాన్ క్రికెటర్లకు అవకాశం కల్పించాలా లేదా అనే అంశానికి ఆ దేశంలో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే విషయంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఐపిఎల్‌లో పాక్ క్రికెటర్లను తీసుకునే విషయాన్ని ఫ్రాంచైజీలతో చర్చిస్తామన్నాడు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌పై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదని చెప్పాడు. ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమీ ఉండదని అన్నాడు.
స్పష్టత ఉంది: తాలూక్దార్
జట్టు నిర్మాణం ఏ విధంగా ఉండాలనే విషయంపై తమకు స్పష్టత ఉందని పుణె జట్టును కొన్న న్యూ రైజింగ్ కంపెనీ సహ భాగస్వామి సుబ్రతో తాలూక్దార్ అన్నాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఆడుతున్న అట్లెటికో డి కోల్‌కతాకు సహ భాగస్వామిగా ఉన్న బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఐపిఎల్ ఫ్రాంచైజీలో ఎలాంటి పాత్ర పోషించబోడని అన్నాడు. పరస్పర ప్రయోజనాల అంశం గంగూలీ విషయంలో తలెత్తదని పేర్కొన్నాడు. తమ సంస్థలో పని చేస్తున్న మనోజ్ తివారీ, అశోక్ దిండాలతో ఇప్పటికే చర్చించామని, త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని చెప్పాడు. జట్టు పేరు, లోగోను ఒకటిరెండు రోజుల్లో ఖరారు చేస్తామన్నాడు. రాజ్‌కోట్ యజమాని కేశవ్ బన్సాల్ మాట్లాడుతూ ధోనీని కొనుగోలు చేసే అవకాశం తమకు రాదని ముందుగానే నిర్ణయించుకున్నామని అన్నాడు. అందుకే సురేష్ రైనాను తమ మొదటి చాయిస్‌గా తీసుకున్నామని చెప్పాడు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, జట్టు కూర్పును ఖరారు చేసుకుంటామని తెలిపాడు.