క్రీడాభూమి

పరుగుల వేటలో డేర్‌డెవిల్స్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మే 7: ఐపిఎల్‌లో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ఓడించేందుకు 182 పరుగులు సాధించాల్సిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయానికి చేరువైనప్పటికీ చివరిలో తీవ్రమైన ఒత్తిడికి గురై, తొమ్మిది పరుగుల తేడాతో ఓడింది.
టాస్ గెలిచిన డేర్‌డెవిల్స్ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయ 181 పరుగులు సాధించింది. మురళీ విజయ్ 25 పరుగులు చేయగా, మార్కస్ స్టొయసిస్ 44 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52, వృద్ధిమాన్ సాహా 33 బంతుల్లో, ఏడు ఫోర్లతో 52 చొప్పున పరుగులు చేశారు. అనంతరం డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 172 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 52, సంజూ శాంసన్ 49, కరుణ్ నాయర్ 23 పరుగులు సాధించినప్పటికీ, చివరిలో బ్యాట్స్‌మెన్ రన్‌రేట్‌ను పెంచలేక ఓటిమిని కొనితెచ్చుకున్నారు.