క్రీడాభూమి

ఆచ్రేకర్‌కు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 3: ప్రఖ్యాత కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ మృతి పట్ల భారత క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సచిన్ తెండూల్కర్ వంటి ఆణిముత్యాన్ని క్రికెట్ ప్రపంచానికి అందించిన ఆచ్రేకర్ మార్గదర్శకంలోనే వినోద్ కాంబ్లీ, ప్రవీణ్ ఆబ్రే, సమీర్ ధిగే, బల్వీందర్ సింగ్ సంధూ వంటి మేటి క్రికెటర్లు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ముంబయిలో తన 87వ ఏట మృతి చెందిన ఆచ్రేకర్‌కు ఘన నివాళులర్పించిన టీమిండియా క్రికెటర్లు, సంతాప సూచకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం మ్యాచ్ ఆడారు. కెరీర్‌లో కేవలం ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన ఆచ్రేకర్ కోచ్‌గా మాత్రం అద్భుతంగా రాణించాడు. అసాధారణ ప్రతిభావంతులను తయారు చేశారు. సచిన్ తెండూల్కర్ తొలి గురువుగా ఆచ్రేకర్ తన పేరును క్రికెట్ చరిత్రలో లిఖించుకున్నాడు.
చిత్రం..నల్ల బ్యాడ్జీ ధరించిన భారత కెప్టెన్ కోహ్లీ