క్రీడాభూమి

స్టార్ బ్యాట్స్‌మన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 3: చతేశ్వర్ పుజారా టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతున్నాడు. ఈ సిరీస్‌లో మూడో సెంచరీ సాధించి, సూపర్ బ్యాట్స్‌మన్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. మెరుపువేగంతో దూసుకొస్తూ, తీవ్రంగా గాయపడే ప్రమాదంలో పడేస్తున్న బంతులను నుంచి తనను తాను కాపాడుకుంటూ అతను చేస్తున్న పోరాటం అభిమానులను ఆకట్టుకుంది. కెరీర్‌లో 18వ టెస్టు సెంచరీని నమోదు చేసిన పుజారా, ఇంగ్లాండ్‌లో 2012-13 సీజన్‌లో జరిపిన పర్యటనలో భాగంగా జరిగిన టెస్టు సిరీస్‌లో సాధించిన 438 పరుగుల మైలురాయిని అధిగమించాడు. అతను 250 బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్‌లో అతను 200లకుపైగా బంతులను ఆడడం ఇది నాలుగోసారి. 1977-78 సీజన్‌లో సునీల్ గవాస్కర్ ఒక టెస్టు సిరీస్‌లో మూడుసార్లు రెండు వందలకుపైగా బంతులు ఎదుర్కొగా, ఆ రికార్డును పుజారా బద్దలు చేశాడు.