క్రీడాభూమి

పుజారా సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 3: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా మరో సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఓపెనర్ మాయాంక్ అగర్వాల్ కూడా ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతో, ఆస్ట్రేలియాతో ప్రారంభమైన చివరి, నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లకు 303 పరుగుల స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కేవలం 10 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. తొమ్మిది పరుగులు చేసిన స్టార్ ఓపెనర్ లోకేష్ రాహుల్ క్రీజ్‌లో నిలదొక్కుకోలేక, జొహ్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో షాన్ మార్ష్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. మొదటి వికెట్ త్వరగా పడినప్పటికీ, ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారాకు మాయాంక్ చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 112 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసిన మాయాంక్‌ను మిచెల్ స్టార్క్ క్యాచ్ అందుకోగా నాథన్ లియాన్ పెవిలియన్‌కు పంపాడు.
రెచ్చగొట్టి ఔట్ చేశారు..
రెండో వికెట్ కూలిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చగొట్టి, ఏకాగ్రతను దెబ్బతీశారు. బంతిని పదేపదే లెగ్‌సైడ్ దిశగా వేస్తూ, అతనిని భారీ షాట్లకు ప్రయత్నించే పరిస్థితిని కల్పించారు. ఆసీస్ బౌలర్లు అనుసరించిన వ్యూహంలో చిక్కుకున్న కోహ్లీ 23 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జొస్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో టిమ్ పైన్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. అజింక్య రహానే తనదైన శైలిలో ఆడకుండా, క్రీజ్‌లో నిలబడేందుకే అధిక ప్రాధాన్యమిచ్చి, ఒత్తిడికి గురై ఔటయ్యాడు. 55 బంతులు ఎదుర్కొన్న అతను అతి కష్టం మీద 18 పరుగులు చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు దొరికిపోయాడు. వికెట్లు కూలుతున్నప్పటికీ, ఏకాగ్రను కొల్పోకుండా బ్యాటింగ్‌ను కొనసాగించిన పుజారాకు తెలుగు తేజం హనుమ విహారీ అండగా నిలిచాడు. మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పుజారా 130 (250 మంతులు, 16 ఫోర్లు), విహారీ 39 (58 బంతులు, 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో జొస్ హాజెల్‌వుడ్ 51 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్‌కు ఒక్కో వికెట్ లభించింది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: మాయాంక్ అగర్వాల్ సీ మిచెల్ స్టార్క్ బీ నాథన్ లియాన్ 77, లోకేష్ రాహుల్ సీ షాన్ మార్ష్ బీ జొస్ హాజెల్‌వుడ్ 9, చతేశ్వర్ పుజారా 130 బ్యాటింగ్, విరాట్ కోహ్లీ సీ టిమ్ పైన్ బీ జొస్ హాజెల్‌వుడ్ 23, అజింక్య రహానే సీ టిమ్ పైన్ బి మిచెల్ స్టార్క్ 18, హనుమ విహారీ 39 బ్యాటింగ్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 303.
వికెట్ల పతనం: 1-10, 2-126, 3-180, 4-228.
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 18-0-75-1, జొస్ హాజెల్‌వుడ్ 20-7-51-2, పాట్ కమిన్స్ 19-3-62-0, నాథన్ లియాన్ 29-5-88-1, మామస్ లాబుస్చాన్ 4-0-25-0.

చిత్రం.. మొదటి రోజు ఆటముగిసిన తర్వాత మైదానం నుంచి
బయటకు వస్తున్న పుజారా, హనుమ విహారి