క్రీడాభూమి

వెల్‌డన్ కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఐపిఎల్ సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే యాభై లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇది ఆరోసారి. విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మాత్రమే ఇప్పటి వరకూ ఒక ఐపిల్ సీజన్‌లో ఆరు అర్ధ శతకాలు చేశారు. ఈ సీజన్‌లో ఇంకా ఎవరూ ఇన్ని హాఫ్ సెంచరీలను సాధించలేదు.
పుణె బ్యాట్స్‌మన్ సౌరభ్ తివారీ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆరో ఓవర్‌లో స్టువర్ట్ బిన్నీ, సచిన్ బేబీ అతనిచ్చి క్యాచ్‌లను జార విడిచారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తివారీ 52 పరుగులు చేయగలిగాడు.

--
బెంగళూరు, మే 7: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం శనివారం పరుగుల వరదతో హోరెత్తింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్న టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్వరూపాన్ని ప్రదర్శించి, అజేయ శతకంతో రాణించిన నేపథ్యంలో 192 పరుగుల భారీ లక్ష్యం కూడా వెలవెలబోయింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకుడిగా ఉన్న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, కోహ్లీ విజృంభణ ముందు నిలవలేకపోయింది. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ధోనీ సేనపై కోహ్లీ బృందం ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
బ్యాటింగ్ సామర్థ్యంపై ఎంతో నమ్మకం ఉన్న బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రైజింగ్ పుణె 26 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను ఉస్మాన్ ఖాజా రూపంలో కోల్పోయింది. అతను ఆరు పరుగులు చేసి, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 16 పరుగులు సాధించి రనౌటయ్యాడు. అయితే ఓపెనర్ రహానే, ఫస్ట్‌డౌన్ ఆటగాడు సౌరభ్ తివారీ రైజింగ్ పుణెను ఆదుకున్నారు. బెంగళూరు బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వీరు రెండో వికెట్‌కు 106 పరుగుల అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని అందించారు. 39 బంతుల్లో, తొమ్మిది ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసిన తివారీని లోకేష్ రాహుల్ స్టంప్ చేయగా యజువేంద్ర చాహల్ అవుట్ చేడంతో 132 పరుగుల స్కోరువద్ద రైజింగ్ పుణె రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ధోనీ (9), తిసర పెరెరా (14) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, 48 బంతుల్లో 74 పరుగులు సాధించిన రహానేను షేన్ వాట్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రహానే స్కోరులో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. రెండు బంతులు ఎదుర్కొన్న జార్జి బెయిలీ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరగ్గా, రైజింగ్ పుణె 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. అప్పటికి రజత్ భాటియా (9), రవిచంద్రన్ అశ్విన్ (10) నాటౌట్‌గా ఉన్నారు. బెంగళూరు బౌలర్లలో వాట్సన్ 24 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. క్రిస్ జోర్డాన్, చాహల్ చెరొక వికెట్ సాధించారు.
చాలెంజర్స్ శుభారంభం
బెంగళూరు ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, లోకేష్ రాహుల్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు వీరు 11.1 ఓవర్లలో 94 పరుగులు జత చేశారు. కోహ్లీకి చక్కటి సహకారాన్ని అందిస్తూ, 35 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేసిన రాహుల్‌ను బెయిలీ క్యాచ్ అందుకోగా ఆడం జంపా అవుట్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి అతను స్టార్ బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్‌ను తిసర పెరెరా క్యాచ్ అందుకోగా పెవిలియన్‌కు పంపాడు. సెకండ్ డౌన్‌లో వచ్చిన షేన్ వాట్సన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి, కేవలం 13 బంతుల్లోనే, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 36 పరుగులు చేసి ఆర్పీ సింగ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్ (6 నాటౌట్)తో కలిసి మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడిన కోహ్లీ 108 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 58 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.

చిత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన బెంగళూరు కెప్టెన్
విరాట్ కోహ్లీ
--

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తాజా సీజన్‌లో ప్రేక్షకులను అమితంగా అలరించిన మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణె సూపర్‌జెయంట్స్ మధ్య శనివారం జరిగింది. మొత్తం 39.3 ఓవర్లు బౌల్‌కాగా, 386 పరుగులు జత కలిశాయ. టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోటీపడుతున్న టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయ, సెంచరీతో నాటౌట్‌గా నిలవడం విశేషం.

* విరాట్ కోహ్లీ ఈ ఐపిఎల్‌లో రెండు శతకాన్ని నమోదు చేశాడు. ఇప్పటి వరకూ ఈ ఐపిఎల్‌లో ఎవరూ రెండు సెంచరీలు సాధించలేదు. కాగా, ఈ ఐపిఎల్‌లో 8వ ఇన్నింగ్స్ ఆడుతూ కోహ్లీ 500 పరుగులు మైలురాయిని అధిగమించాడు. ఒక సీజన్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 2011 సీజన్‌లో క్రిస్ గేల్ 9వ ఇన్నింగ్స్‌లో 500 పరుగులు పూర్తి చేశాడు.
* ఈసారి ఐపిఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ముప్పయికిపైగా పరుగులు చేసి, మూడు లేదా అంతకు మించి వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో
షేన్ వాట్సన్
మూడో స్థానంలో ఉన్నాడు. ఇంతకు ముందు తిసర పెరెరా, కార్లొస్ బ్రాత్‌వెయిట్ ఈ ఫీట్‌ను సాధించారు.
* ఎబి డివిలియర్స్ వరుసగా రెండోసారి విఫలమయ్యాడు. నాలుగు, ఒకటి చొప్పున పరుగులు చేసి అభిమానులను నిరాశ పరిచాడు. అంతకు ముందు ఆరిన్నింగ్స్‌లో అతను 20కి తక్కువ కాకుండా పరుగులు సాధించాడు.
* బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌కి ముందు ఒక్కసారి కూడా మొదటి వికెట్‌కు 50 పరుగులు పూర్తి చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, లోకేష్ రాహుల్ 94 పరుగులు జోడించారు.
ఈ జట్టు పవర్ ప్లే మొదటి మూడు ఓవర్లలో కేవలం 10 పరుగులు చేసింది. అయితే, తర్వాత మూడు ఓవర్లలో 36 పరుగులతో అదరగొట్టింది.
* రాయల్ చాలెంజర్స్ బౌలర్లు మొదటి పది ఓవర్లలో ఒక్క ఓవర్‌ను కూడా కనీసం ఒక బౌండరీ లేకుండా వేయలేకపోయారు. వాట్సన్ పదో ఓవర్ వేయగా, మొదటి ఐదు బంతుల్లో కేవలం మూడు పరుగులిచ్చాడు. అయితే, చివరి బంతిలో బౌండరీ ఇచ్చాడు.
* ఐపిఎల్‌లో ఆడిన 14వ ఇంగ్లాండ్ ఆటగాడిగా క్రిస్ జోర్డాన్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకూ 13 మంది ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపిఎల్‌లో ఆడారు. జోర్డార్ ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగాడు.