క్రీడాభూమి

నేటి నుంచి ఆసియా కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబుదాబి, జనవరి 4: అంతర్జాతీయ పురుషుల ఆసియా కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (17వ ఎడిషన్) అబుదాబిలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి భారీ ఎత్తున నిర్వహించే ఈ పోటీలకు ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆతిధ్యం ఇవ్వనుంది. జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1వరకు అత్యంత భారీ ఎత్తున నిర్వహించే ఈ పోటీలకు అబుదాబిలోని నాలుగు ప్రధాన నగరాల్లోని వివిధ క్రీడా మైదానాలు వేదికలు కానున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం అంటే 2011లో ఆసియా కప్ టోర్నీలో ప్రాతినిధ్యం వహించిన భారత్ గ్రూప్ స్టేజీ నుంచి వెనుతిరగాల్సి వచ్చింది. అయితే, అప్పటికీ ఇప్పటికీ జట్టులో ఎన్నో మార్పులు, చేర్పులతోపాటు సంచలనం సృష్టించే సత్తా కలిగిన యువకులు ఉండడం కలిసొచ్చే అంశం. ఈనెల 5 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆతిధ్య ఇవ్వనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కప్ కైవసం చేసుకునేందుకు ఆరు గ్రూపులుగా 24 జట్లు పోటీపడనున్నాయి. శనివారం ఇక్కడి జరుూద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరిగే ప్రారంభ పోటీలో భాగంగా ఆతిధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్రూప్-ఏలో బెహ్రెయిన్‌తో తలపడుతుంది. రెండో రోజు ఇదే గ్రూప్‌లో భాగంగా అల్ నహ్యాన్ స్టేడియంలో జరిగే పోటీలో థాయిలాండ్‌తో భారత్ పోటీపడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం భారత్ 97వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. 2011లో గ్రూప్ స్టేజీ నుంచి వెనుతిరిగిన భారత్ ఇపుడు అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడం ద్వారా 2026లో జరిగే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకునేందుకు కలలు కంటోంది. చీఫ్ కోచ్ స్టీఫెన్ కాన్‌స్టంటైన్ ఆధ్వర్యంలోని 28 మంది సభ్యులు కలిగిన భారత జట్టు గత నెల 23 పోటీలు జరిగే ప్రాంతానికి చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీసు చేసింది. ఆసియా కప్ టోర్నీ మామూలు టోర్నీల కంటే చాలా భిన్నమని, తమ జట్టు సభ్యులంతా తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలరనే ఆశాభావాన్ని చీఫ్ కోచ్ వ్యక్తం చేశాడు.