క్రీడాభూమి

ఎనిమిదేళ్ల తర్వాత..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబూదబీ, జనవరి 5: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియా సుమారు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగంలోకి దిగనుంది. ఆసియా ఫుట్‌బాల్ మండలి (ఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో జరిగే ఆసియా కప్ సాకర్ టోర్నమెంట్ గ్రూప్ దశ తొలి మ్యాచ్‌లో ఈ జట్టు చిరకాల ప్రత్యర్థి పాలస్తీనాను ఢీ కొంటుంది. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో ఆడే అవకాశాన్ని సిరియా తృటిలో చేజార్చుకుంది. క్వాలిఫయర్స్ చివరి అడ్డంకిని సమర్థంగా అధిగమించలేక, నిరాశతో వెనుదిరిగింది. అప్పటి వైఫల్యాన్ని పక్కకుపెట్టి, ఆసియా కప్‌లో రాణించడం ద్వారా సత్తా చాటాలని సిరియా జాతీయ జట్టు భావిస్తున్నది. అయితే, ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు ఈ జట్టు ఆటగాళ్లపై మండిపతున్నాయి. ప్రజా శ్రేయస్సును విస్మరించడమేగాక, వారి జీవితాలతో చెలగాటమాడుతున్న సర్కారుకు ఈ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్నదని సిరియాలో ప్రతిపక్ష వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలావుంటే, జట్టు సభ్యులు మాత్రం తమకు లభించిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోరాదన్న పట్టుదలతో ఉన్నారు. ‘ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆడే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నాం. అప్పట్లో చోటు చేసుకున్న పొరపాట్లను పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం. ఆసియా కప్‌లో శక్తి వంచన లేకుండా పోరాడతాం. టైటిల్ అందుకోవడమే లక్ష్యంగా ఆడతాం’ అని జట్టు కీలక సభ్యుడు ముయాద్ అజాన్ అన్నాడు. ఈ టోర్నమెంట్‌కు అర్హత సంపాదించడమే తమ ప్రాథమిక విజయమని వ్యాఖ్యానించాడు. జట్టులోని మిగతా సభ్యులు కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. ఎసియా కప్‌లో తమను తాము నిరూపించుకునే ప్రయత్నంలో పడ్డారు.
భారత్ తొలి ప్రత్యర్థి థాయిలాండ్
‘అండర్ డాగ్’ ముద్రతో బరిలోకి దిగుతున్న భారత్‌కు థాయిలాండ్ తొలి ప్రత్యర్థి. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి, టోర్నమెంట్‌లో శుభారంభం చేయాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. గతంలో ఈ టోర్నమెంట్‌లో 16 జట్లు ఆడేవి. తొలిసారి 24 జట్లతో నిర్వహిస్తున్నారు. 1964లో రన్నరప్స్‌గా నిలవడాన్ని మినహాయిస్తే, ఆసియా కప్ టోర్నీలో భారత్ ప్రదర్శన ఎన్నడూ చెప్పుకోదగిన రీతిలో లేదు. 1984, 2011 సంవత్సరాల్లో భారత్ నాకౌట్ దశకు కూడా చేరలేక, గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. కాగా, ప్రస్తుతం బరిలో ఉన్న 24 జట్లను ఆరు గ్రూపులుగా విభజిస్తున్నారు. ఈ గ్రూపుల్లో మొదటి రెండు స్థానాలు సంపాదించిన జట్లకు ‘రౌండ్ 16’లో చోటు లభిస్తుంది. అదే విధంగా పాయింట్ల పట్టికను అనుసరించి, మూడో స్థానంలో ఉన్న నాలుగు జట్లు కూడా ‘రౌండ్ 16’కు చేరతాయి. గ్రూప్ దశ ముగిసిన తర్వాత, మ్యాచ్‌లన్నీ నాకౌట్ విధానంలోనే జరుగుతాయి. కాగా, కనీసం నాకౌట్ దశకు చేరడమే భారత జట్టు తొలి లక్ష్యంగా ఎంచుకుంది.