క్రీడాభూమి

అమీర్‌కు అల్వరెజ్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ వెగాస్, మే 8: ప్రపంచ బాక్సింగ్ మండలి (డబ్ల్యుబిసి) మిడిల్‌వెయిట్ బాక్సింగ్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలన్న బ్రిటన్ బాక్సర్ అమీర్ ఖాన్‌కు చుక్కెదురైంది. సమర్థుడైన బాక్సర్‌గా పేరుపొంది, ఈ ఫైట్‌లో ఫేవరిట్‌గా బరిలోకి దిగిన అమీర్‌కు డిఫెండింగ్ చాంపియన్ కనెలో అల్వరెజ్ షాకిచ్చాడు. ఐదు రౌండ్ల వరకూ అద్వితీయ పోరాట పటిమను కనబరచిన అమీర్ ఆరో రౌండ్‌లోనూ అల్వరెజ్‌ను ఎదురొడ్డి పోరాడేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ రౌండ్ మరో 23 సెకన్లలో ముగియనున్న సమయంలో అల్వరెజ్ విసిరిన రైట్ హుక్ నేరుగా అమీర్ దవడకు తగిలింది. బలమైన ఆ పంచ్ ధాటికి కిందపడిన అమీర్ కిందపడి మళ్లీ లేవలేకపోయాడు. అల్వరెజ్‌కు నాకౌట్ విజయం లభించింది. లైట్ వెల్టర్‌వెయిట్ నుంచి రెండు ఒక్కసారిగా రెండు స్థాయిలను ముందుకు దూకి మిడిల్‌వెయిట్ విభాగంలో తలపడిన అమీర్ తన నిర్ణయానికి మూల్యాన్ని చెల్లించుకున్నాడు. 35వ ఫైట్‌లో పాల్గొన్న అమీర్‌కు కెరీర్‌లో ఇది నాలుగో ఓటమి. మెక్సికోలో టాప్ బాక్సర్‌గా పేరుపొందిన అల్వరెజ్ 49వ ఫైట్స్‌లో పోటీపడి, 47 విజయాలను సాధించాడు. అతని ఒకే ఒక ఫైట్‌ను చేజార్చుకోగా, ఒక ఫైట్ ఫలితం తేలకుండా డ్రా అయింది. ప్రత్యర్థులపై బలమైన పంచ్‌లతో విరుచుకుపడే అల్వరెజ్ మరోసారి అదే విధానాన్ని అనుసరించి, అమీర్‌ను ఓడించాడు.

chitram...
అమీర్ ఖాన్‌పై బలమైన పంచ్ విసిరిన అల్వరెజ్ (కుడి). ఆరో రౌండ్‌లో అతని రైట్ హుక్ బలంగా దవడకు తగలడంతో అమీర్ కుప్పకూలిపోయాడు