క్రీడాభూమి

వరుణుడు అడ్డుకున్నా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: ఏం జరగొద్దని ఆటగాళ్లు సహా, అభిమానులు కోరుకున్నారో అదే జరిగింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు నాలుగో రోజు ఆదివారం ఉదయం నుంచి వరుణుడు అడ్డుకున్నాడు. కేవలం 25.2 ఓవర్ల పాటు సాగిన ఆటలో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలో ఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. మధ్యలో భారత్ విజయానికి వరుణుడు అడ్డుపడడంతో ఆట మరుసటి రోజుకు వాయదా పడింది. చివరి రోజు వరుణుడు అడ్డుకున్నా కోహ్లీ సేన చరిత్ర సృష్టించనుంది. నాలుగో రోజు మూడు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైనా , మొదటి మూడు నిమిషాలకే వికెట్ పడడంతో భారత శిబిరంలో ఆశలు రెకెత్తాయ. ఓవర్ నైట్ స్కోర్ 6/236తో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను మొదటి మూడు నిమిషాలకే షమీ దెబ్బ కొట్టాడు. అప్పటివరకు నిలకడగా ఆడుతున్న పాట్ కమ్మిన్స్ (25)ను షమీ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ స్టార్క్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే క్రమంలో పీటర్ హాండ్స్‌కాబ్ (37) కూడా వెనువెంటనే బూమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. నాథన్ లియాన్‌తో జత కట్టిన మిచెల్ స్టార్ క 29 (నాటౌట్) అచితూచి ఆడాడు. ఈ క్రమంలో మూడో రోజు మూడు వికెట్లు తీసి జోరుమీదున్న కుల్దీప్ యాదవ్ నాథన్ లియాన్ (0) ను ఎల్‌బీగా పెవిలియన్ పంపాడు. కొద్దిసేపటికే క్రీజులోకి వచ్చి నిలకడగా ఆడుతున్న జోష్ హజెల్‌వుడ్‌ను సైతం ఎల్‌బీగా అవుట్ చేయడంతో 300 పరుగులకే ఆసీస్ ఆలౌట్ అయంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసి రెండోసారి ఈ ఘనత సాధించగా, షమీ, రవీంద్ర జడేజా రెండేసి, బూమ్రా ఒక వికెట్ తీశాడు.
322 పరుగుల భారీ ఆధిక్యం..
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌కు 322 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. గతంలో విదేశాల్లో వెస్టిండీస్, ఇంగ్లాండ్‌పై (373, 355, 323) మాత్రమే భారత్ మొదటి ఇన్నింగ్స్‌ల్లో భారీ ఆధిక్యం సంపాదించింది.
స్కోర్ బోర్డు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 622/7 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: మార్కస్ హారిస్ (బీ) రవీంద్ర జడేజా 79; ఉస్మాన్ ఖాజా (సీ) పుజారా (బీ) కుల్దీప్ యాదవ్ 27; మామస్ లాబుస్చాన్ (సీ) రహానె (బీ) షమీ 38; షాన్ మార్ష్ (సీ) రహానె (బీ) రవీంద్ర జడేజా 8; ట్రావిస్ హెడ్ (సీ), (బీ) కుల్దీప్ యాదవ్ 20; పీటర్ హాండ్స్‌కాబ్ (బీ) బూమ్రా 28; టిమ్ పైన్ (బీ) కుల్దీప్ యాదవ్ 5; పాట్ కమ్మిన్స్ (బీ) షమీ 25; మిచెల్ స్టార్క్ 29 (నాటౌట్); నాథన్ లియాన్ ఎల్‌బీ (బీ) కుల్దీప్ యాదవ్ 0; జోష్ హజెల్‌వుడ్ ఎల్‌బీ (బీ) కుల్దీప్ యాదవ్ 21.
ఎక్‌స్ట్రాలు: 11; మొత్తం: 300 (104.5ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-72, 2-128, 3- 144, 4- 152, 5- 192, 6- 198, 7- 236, 8- 257, 9- 258, 10- 300.
బౌలింగ్ : మహమ్మద్ షమీ 19-2-58-2, జస్ప్రీత్ బూమ్రా 21-5-62-1, రవీంద్ర జడేజా 32-11-73-2, కుల్దీప్ యాదవ్ 31.5-6-99-5.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఉస్మాన్ ఖాజా (బ్యాటింగ్) 4; మార్కస్ హారిస్ (బ్యాటింగ్) 2.
బౌలింగ్ : మహమ్మద్ షమీ 2-1-4-0, జస్ప్రీత్ బూమ్రా 2-1-2-0. ఎక్‌స్ట్రాలు: 0; మొత్తం: 6 (4ఓవర్లలో)

చిత్రం..*కుల్దీప్ యాదవ్ (5/99)