క్రీడాభూమి

టీమిండియాలో భాగస్వామిని కావడం గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 7: ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ముద్దాడిన టీమిండియాలో తాను కూడా భాగస్వామినైనందుకు ఎంతో గర్వంగా ఉందని సిరీస్‌లో అత్యధిక పరుగుల వీరుడు చటేశ్వర్ పుజారా అన్నాడు. ఆసిస్‌తో తలపడిన టెస్టు సిరీస్‌లో మూడు శతకాలతోపాటు 74 సగటున 521 పరుగులు చేసిన పుజారా చారిత్రాత్మక సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో కీలక భూమిక పోషించాడు. టెస్టు సిరీస్‌లో గెల్చినందుకు పుజారా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’, ‘మ్యాన్ ఆఫ్ ప్లేయర్’ అవార్డులను అందుకున్నాడు. ‘ఈ అద్భుత గెలుపును మేము గొప్పగా అనుభవిస్తున్నాం. జట్టు సభ్యులందరి సమష్టి కృషితోనే ఈ ఘన విజయం సాధ్యమైంది. ఆసిస్‌పై సిరీస్ గెలవడం అంత సులువు కాదు. చరిత్రలో లిఖించదగ్గ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన జట్టులో భాగస్వామినైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఘనత సాధించిన సభ్యులందరికీ అభినందనలు’ అని పుజారా పేర్కొన్నాడు. ఆసియా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచిన కోహ్లీసేన 71 ఏళ్ల తర్వాత ఆసిస్ మైదానంలో 2-1తో ఘన విజయం సాధించడంలో బౌలర్ల సామర్థ్యాన్ని ప్రస్తుతించాడు. ‘నలుగురు బౌలర్లతో 20 వికెట్లు తీయడం అనుకున్నంత ఈజీ కాదు. కానీ క్రెడిట్ అంతా మా ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లకే దక్కుతుంది. ఇది చెప్పుకోదగ్గ, చిరస్మరణీయ ఘట్టం’ అని పుజారా పేర్కొన్నాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా తన శక్తిమేరకు జట్టును ఆదుకునేందుకు కృషి చేశానని, గతంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ టూర్‌లలో నేర్చుకున్న మెళకువలు ఇపుడు ఎంతో దోహదపడ్డాయని అన్నాడు.

చిత్రం.. చటేశ్వర్ పుజారా