క్రీడాభూమి

చారిత్రాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: 72 ఏళ్ల చరిత్రలో దిగ్గజాలకు సైతం సాధ్యం కాని కలను కోహ్లీ సేన సాకారం చేసింది! ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవాలన్న దశబ్దాల భారత జట్టు కోరికను 2-1తో సాధించి చరిత్ర సృష్టించింది! మునుపెన్నడూ లేని విధంగా తమ జట్టెంత బలియమైనదో ప్రత్యర్థి జట్లను మరోసారి హెచ్చరించింది! అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌తో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి ఆతిథ్య జట్టును ‘కంగా రె’త్తించింది! సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు ఐదో రోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది! నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1తో ముందంజలో ఉండడంతో, సిరీస్ భారత్ వశ మైంది! చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని సాధించిన టీమిండియాను యావత్ భారత్ ప్రశంసలతో ముంచెత్తింది!
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరగుతున్న చివరి టెస్టు వెలుతురు లేమి, వర్షంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లయంది. చివరి టెస్టులో టాస్ గెలిచి మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భార త్ ఏడు వికెట్లు కోల్పోయ 622 పరుగుల వద్ద రెండో రోజు డిక్లేర్డ్ చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటి కే పూర్తి వికెట్లు కోల్పోయ 300 పరుగులు చేసింది. అప్పటికే 322 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా ఆస్ట్రేలియా ను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 6 పరుగులు సాధించగా ఆటను వరుణుడు అడ్డుకున్నాడు. నాలుగో రోజు కేవలం 25.2 ఓవర్ల పాటు మాత్ర మే ఆట సాగింది. ఇక చివరి రోజు వర్షంతో ఆట పూర్తిగా నిలిచిపోవడంతో మ్యా చ్‌ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించా రు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది. టీమిండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కాయ. ఈ సిరీస్‌లో అత్యధికంగా చటే శ్వర్ పుజారా 521 పరుగులు సాధించగా, బౌలిం గ్‌లో జస్ప్రీత్ బూమ్రా 21, మహమ్మద్ షమీ 16, ఇషాంత్ శర్మ 11 వికెట్లు తీశారు.
కోహ్లీ ఖాతాలో రికార్డు..
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఆసియా ఖండంలో ఆసియా జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించిన ఘనతను అందుకున్నాడు. ఆసియాన్ జట్లను మినహాయస్తే ఆస్ట్రేలియా ను సొంతగడ్డపై ఇంగ్లాండ్ అత్యధికంగా 13 సార్లు, వెస్టిండీస్ 4 సార్లు, దక్షిణాఫ్రికా 3 సార్లు, న్యూజిలాండ్ ఒకసారి ఓడించాయ.
విదేశీ గడ్డపై నాలుగో సిరీస్ విజయం..
కెప్టెన్ విరాట్ కోహ్లీకి విదేశీ గడ్డపై ఇది నాలుగో సిరీస్ విజయం. 2015లో శ్రీలంక గడ్డపై 2-1తో సిరీస్ గెల్చుకోగా, 2016లో వెస్డిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్, 2017లో శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశారు. తాజాగా ఆస్ట్రేలి యాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో విజయం సాధించారు.
చిత్రం..బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో భారత జట్టు