క్రీడాభూమి

‘మాజీ’ల నిర్లక్ష్యం బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మే 8: కోచ్ పదవికి కొంత మంది మాజీ క్రికెటర్లు ముందుకు రాకపోవడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా పేర్లను ప్రస్తావించకపోయినా, పరోక్షంగా మోసిన్ ఖాన్, అకీబ్ జావేద్‌పై అతను విమర్శలు గుప్పించాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోకుండా పలువురు మాజీ క్రికెటర్లు నిర్లక్ష్యం వహించడం బాధాకరమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) సలహాదారుగా వ్యవహరిస్తున్న అక్రం అన్నాడు. పిసిబి అధ్యక్షుడు నేరుగా తనతో మాట్లాడితేనే కోచ్‌గా దరఖాస్తు చేస్తానని ఒక మాజీ క్రికెటర్ తనతో చెప్పాడని అతను ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇలాంటి ఆలోచన ఉన్న వారు దేశ క్రికెట్‌కు ఏమాత్రం సేవలు అందిస్తారో ఊహించడం కష్టం కాదని అన్నాడు. మాజీ క్రికెటర్లను తాను ఎంతగానో గౌరవిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. విదేశీ కోచ్ వల్లే పాక్ క్రికెట్ సమస్యల నుంచి గట్టెక్కుతుందని తాను ఏనాడూ సలహా ఇవ్వలేదని స్పష్టం చేశాడు. స్వదేశీ కోచ్‌లు ఉండరాదన్నది తన అభిప్రాయం కాదన్నాడు. అయితే, విదేశీ కోచ్‌ని నియమించడం వల్ల నష్టమేమీ లేదని అతను వ్యాఖ్యానించాడు. జట్టుకు కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన మికీ ఆర్థర్ నియామకాన్ని అక్రం సమర్థించాడు. కోచ్‌గా అతనికి ఎంతో అనుభవం ఉందన్నాడు. పాక్ జట్టుకు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకం చేస్తాడన్న నమ్మకం తనకు ఉందని తెలిపాడు. పాక్ జట్టు మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుంటుందన్నాడు.