క్రీడాభూమి

కోహ్లీ నెం.1, పుజారా 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, జనవరి 8: ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్స్ ర్యాకింగ్‌లో కోహ్లీ తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన చటేశ్వర్ పుజారాకు మూడో స్థానం దక్కింది. తాజాగా ఐసీసీ ర్యాంకులో వీరద్దరితో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్ 21వ ర్యాంకింగ్ నుంచి 17వ ర్యాంకుకు చేరుకు న్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరసీలో పుజారా నాలుగు టెస్టుల్లో 3 సెంచరీలతో 521 పరుగులు చేశాడు. అంతేకాకుండా మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, సిరీస్‌లను దక్కించుకోవడం తో మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇక కీపర్ రిషబ్ పంత్ మొదటిసారిగా 17వ ర్యాంకు సాధించాడు. లెజెండరీ టీమిండియా వికెట్ కీపర్ మహీంద్రా సింగ్ ధోని ఇప్పటి వరకు టెస్టుల్లో 19 వ ర్యాంకులోనే కొనసా గగా, పంత్ భారత వికెట్ కీపర్లలో 17వ ర్యాంకు సాధించాడు. పంత్ 2016లో జరిగిన ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్‌లో నేపా ల్‌పై 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. కేవలం 9 అంతర్జాతీయ టెస్టులాడిన పంత్ ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో 159 పరుగులు సాధించి టాప్ 20లో స్థానం సంపాదించుకోవడం గమ నార్హం. ఈ సిరీస్‌లో బ్యాటింగ్‌తో రాణించి పంత్, 20 క్యాచ్‌లు అందుకున్నాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరు స్థానాలు ఎగబాకి 57వ స్థానంలో, మయాంక్ అగర్వాల్ 62వ ర్యాంకింగ్‌లో కొనసాగుతు న్నారు. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకొని కెరీర్‌లో 45వ ర్యాంక్ సాధించాడు.
మహమ్మద్ షమీ 22, జస్ప్రీత్ బూమ్రా 16, రవీంద్ర జడేజా 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రాం 10వ ర్యాంకింగ్‌లో కొనసాగుతుండగా, బవుమా మొదటిసారి టాప్ 30లో చోటు సంపాదించుకున్నాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ 16వ స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ రెండో స్థానంలో కొనసాగుతు న్నాడు.

చిత్రాలు.. విరాట్ కోహ్లీ * చటేశ్వర్ పుజారా * రిషబ్ పంత్