క్రీడాభూమి

రాస్ టేలర్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్సాన్ (న్యూజిలాండ్): వెటరన్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్, హెన్రీ నికోలస్ సెంచరీలతో చెలరేగిన మ్యాచ్‌లో శ్రీలంక 115 పరుగులతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో మూడు వనే్డల సిరీస్‌ను 3-0 తేడాతో న్యూజిలాండ్ గెలుచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణిత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో కెప్టెన్ కెన్ విలియమ్స్ (55) అర్ధ సెంచరీతో రాణించగా, సినీయర్ ఆటగాడు రాస్ టేలర్ (137), హెన్రీ నికోలస్ (124 నాటౌట్) రాణించారు. ఆది నుంచే దూకుడుగా ఆడిన న్యూజిలాండ్ జట్టు 16 పరుగుల వద్ద మలింగ వేసిన అద్భుత బంతికి మార్టిన్ గుప్తిల్ (2) తక్కువ స్కోరుకే అవుటవ్వగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కెన్ విలియమ్స్‌తో కలిసి కోలిన్ మున్రో స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అయతే మున్రో (21)ను మలింగ్ బౌల్డ్ చేశాడు.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్ చేలరేగి ఆడాడు. వీరిద్దరూ కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 27వ ఓవర్‌లో సందకన్ బౌలింగ్ విలియమ్సన్ అవుట్ అయ్యాడు. హెన్రీ నికోలస్ క్రీజ్‌లోకి వచ్చి రావడంతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ 154 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో రాస్ టేలర్ తన కెరీర్‌లో 20వ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జెమ్స్ నిషామ్‌తో కలిసి నికోలస్ జట్టు పరుగులను 364 పరుగులకు చేర్చారు. హెన్రీ నికోలస్ కెరీర్‌లో ఆరో సెంచరీ సాధించాడు. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ లసిత్ మలింగకు 3, లక్షన్ సందకన్‌కు ఒక వికెట్ లభించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లంక 41.4 ఓవర్లలోనే 249 పరుగులు చేసి ఆలౌటైంది. సినీయర్ బ్యాట్స్‌మన్ తిషారా పెరీరా (80), నిరోషాన్ డిక్వెల్లా (46), కుశల్ పెరీరా (43), ధనుంజయ్ డిసిల్వా (36), దినుషక గుణతిలక (31) మాత్రమే చెప్పుకునే విధంగా రాణించినా లంకకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్‌కి 4, ఇష్ సోది 3, టిమ్ సౌథీ, జెమ్స్ నిషామ్‌కి తలో వికెట్ లభించింది. అద్భుతంగా ఆడి కెరీర్‌లో 20 శతకం సాధించిన సినీయర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌కి మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది.

చిత్రం..సెంచరీతో జట్టును గెలిపించిన రాస్ టే లర్