క్రీడాభూమి

ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం అద్భుత ఘట్టం : కపిల్‌దేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), జనవరి 8: ఆస్ట్రేలియా గెడ్డపై ఆస్ట్రేలియాతో 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ గెలుపొందడం అద్భుత ఘట్టమని మాజీ కెప్టెన్, 1983 ప్రపంచకప్ విజయసారథి కపిల్ దేవ్ అన్నారు. విశాఖలో ఒక సంస్థ నిర్వహించిన టీ-10 లీగ్ క్రికెట్ విజేతలకు బహుమతి ప్రదానం సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపిల్‌దేవ్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాపై ఘన విజయం ద్వారా ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా సభ్యులకు కపిల్‌దేవ్ శుభాకాంక్షలు తెలిపారు. వైజాగ్‌లో క్రికెట్‌కు ఎంతో అదరణ ఉందన్న విషయం ఇప్పుడే తెలిసిందన్నారు. ఇక్కడి ప్రజల ఆదరణ, అభిమానం మరిచిపోలేనని, భవిష్యత్‌లో విశాఖ నుంచి ఆహ్వానం అందితే తప్పకుండా హజరవుతానన్నారు. కపిల్‌దేవ్ 60వ పుట్టిన రోజు (జనవరి 6)ను పురస్కరించుకుని కేట్‌ కట్ చేశారు. అనంతరం కపిల్‌దేవ్‌ను అభిమానులు, నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

చిత్రం..భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ను సత్కరిస్తున్న దృశ్యం