క్రీడాభూమి

‘పంత్ నా బిడ్డను ఆడిస్తావా?’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జనవరి 9: ఆస్ట్రేలియా పర్యటనలో స్లెడ్జింగ్, బ్యాటింగ్‌తో వార్తల్లో నిలిచిన రిషబ్ పంత్‌ను ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ భార్య బొన్ని పైన్‌చే ఆ మధ్య బేబి సిట్టర్‌గా కితాబునందుకున్న విషయం తెలిసిందే. అయతే ఇటీవల తండ్రి అయన టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ కూడా తన కూతురిని ఆడించాలని పంత్‌ను కోరుతున్నాడు. ‘గుడ్ మార్నింగ్’ అనే పంత్ ట్వీట్‌కు బదులిస్తూ ‘శుభోదయం బడ్డీ.. నీవు మంచి బేబీ సిట్టర్ వని విన్నా. రితికాను సంతోషంగా ఉంచాలంటే నాకు ఓ బేబీ సిట్టర్ కావాలి’ అంటూ సర దాగా పేర్కొన్నాడు. ఇదే తరహా బొన్ని పైన్ కూడా మరోసారి పంత్‌ను సాయం కోరింది. ‘పంత్ నీవు ఫ్రీగా ఉంటే మరోసారి నా పిల్లల్ని ఆడించవా?’ అంటూ ట్వీట్ చేసింది.