క్రీడాభూమి

మాడ్రిడ్ క్వీన్ హాలెప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 8: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ మహిళల టైటిల్ సిమోనా హాలెప్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె డొమినికా సిబుల్‌కొవాను 6-2, 6-4 తేడాతో సునాయాసంగా ఓడించింది. మొదటి రౌండ్‌లో మసాకీ డోయ్‌పై గెలిచిన ఆమె ఆతర్వాత వెనుతిరిగి చూడలేదు. రెండో రౌండ్‌లో కరిన్ నాప్‌ను, మూడో రౌండ్‌లో తిమియా బసిన్‌జిక్‌స్కీని ఇంటిదారి పట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో ఇరినా కామిల్లా బెగూపై, ఆతర్వాత సెమీస్‌లో సమంతా స్టొసుర్‌పై తిరుగులేని విజయాలను నమోదు చేసింది. ఫైనల్‌లో సిబుల్కొవాపై గెలిచి టైటిల్ అందుకుంది. మరోవైపు సిబుల్కొవా మొదటి రౌండ్‌లోనే టాప్ సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. రెండో రౌండ్‌లో కరోలిన్ గార్సియాను, మూడో రౌండ్‌లో అనస్తాసియా పవ్లిచెన్కొవాను ఓడించి క్వార్టర్స్ చేరింది. సొరానా సిర్‌స్టియాపై విజయం సాధించి సెమీస్ చేరిన ఆమె లూసియా సిర్‌స్టియాపై గెలుపొంది ఫైనల్ చేరింది. అయితే, టైటిల్ పోరులో హాలెప్‌ను ఓడించలేక రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది.
ముర్రేతో జొకోవిచ్ ఢీ
పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రేతో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఢీ కొంటాడు. ముర్రే మొదటి సెమీ ఫైనల్‌లో రాఫెల్ నాదల్‌ను 7-5, 6-4 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. రెండో సెమీ ఫైనల్‌లో జొకోవిచ్ 6-3, 7-6 ఆధిక్యంతో కెయ్ నిషికోరిపై గెలుపొందాడు. ఈసారి మాడ్రిడ్ ఓపెన్‌లో ఇప్పటి వరకూ ఒక్క సెట్‌ను కూడా కోల్పోకుండా విజయాలను నమోదు చేస్తున్న జొకోవిచ్‌కే ఫైనల్‌లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.